ఎన్టీఆర్‌ 30 కి జాన్వీ కపూర్‌ ఎన్ని రోజులు కేటాయించిందో తెలుసా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ( NTR )హీరోగా కొరటాల శివ( Koratala Shiva ) దర్శకత్వం లో రూపొందుతున్న ఎన్టీఆర్‌ 30( NTR 30 ) చిత్రం షూటింగ్ కార్యక్రమాలు ఇటీవలే ప్రారంభం అయిన విషయం తెలిసిందే.వచ్చే నెలలో సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతుందంటూ చిత్ర యూనిట్ సభ్యుల ద్వారా సమాచారం అందుతుంది.

 Janhvi Kapoor Role In Ntr And Koratala Siva Ntr 30 Movie , Janhvi Kapoor ,janhvi-TeluguStop.com

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్( Janhvi Kapoor ) నటించినట్లు అధికారికంగా వెళ్లడైంది.ఇటీవల హైదరాబాద్‌ లో జరిగిన పూజ కార్యక్రమాలకు కూడా ఈ ముద్దుగుమ్మ హాజరయ్యింది.

ప్రస్తుతం కొరటాల శివ ప్రీ ప్రొడక్షన్ వర్క్ తో బిజీ గా ఉన్నాడు.మొదటి షెడ్యూల్లో ఎన్టీఆర్ పై కీలకమైన యాక్షన్స్ సీన్స్‌ ని చిత్రీకరించబోతున్నట్లుగా సమాచారం అందుతుంది.

మే నెలలో జాన్వీ కపూర్ సినిమా షూటింగ్ లో జాయిన్ కాబోతున్నట్లు సమాచారం అందుతుంది.ఈ ఏడాది చివరి వరకు సినిమా చిత్రీకరణ జరగబోతుందట.అయినా కూడా ఈ సినిమా కోసం జాన్వీ కపూర్ కేవలం 50 రోజుల డేట్స్ కేటాయించినట్లు తెలుస్తోంది.మహా అయితే మరో పది పదిహేను రోజులు పెరుగుతుందేమో.

దర్శకుడు కొరటాల శివ ఆమె ను 50 రోజుల డేట్స్ మాత్రమే అడిగాడట, ఈ తక్కువ రోజులకే ఆమెకు దాదాపుగా రెండున్నర కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ముట్ట చెబుతున్నట్లుగా సమాచారం అందుతుంది.కొరటాల శివ సినిమా అంటే హీరోయిన్ కి ఎక్కువగా ప్రాముఖ్యత ఉండదు అనే విషయం అందరికి తెల్సిందే.

కనుక జాన్వీ కపూర్ తక్కువ రోజుల్లోనే తన పాత్ర ను ముగించే అవకాశం ఉంటుంది.అయితే ఈ సినిమా తో జాన్వీ కపూర్ కి తెలుగు లో బ్రేక్ లభిస్తుందా లేదా అనేది చూడాలి.

ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా అవ్వడంతో పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి.మరి అందుకు తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుందా అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube