ఆ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు సక్సెస్ సాధించాలి అంటే తప్పనిసరిగా దర్శకనిర్మాతలు చెప్పినట్టు వినాలి.అప్పుడే కొంతకాలం పాటు ఇండస్ట్రీలో మనం మనుగడ సాధించగలము.
ఇలా చాలామంది నటీమనులు దర్శక నిర్మాతలు చెప్పిన పని చేయలేక ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు.అయితే తాను కూడా అలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాను అంటూ నటి సన( Sana ) ఒక ఇంటర్వ్యూ ద్వారా తాను ఇండస్ట్రీలో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల గురించి తెలియజేశారు.
దక్షిణాది సినీ ఇండస్ట్రీలో సుమారు 600 కు పైగా సినిమాలలో నటించి మెప్పించినటువంటి ఈమె బుల్లితెర కార్యక్రమాలపై కూడా సందడి చేస్తున్నారు.

ఇలా వరుస సినిమాలు సీరియల్స్ ( Serials )ఎంతో బిజీగా ఉన్నటువంటి సన తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె మాట్లాడుతూ తనకు పదో తరగతిలోనే పెళ్లి చేశారని తెలిపారు.చిన్నప్పటినుంచి నటనపై ఆసక్తి ఉండడంతో తన అత్తయ్య మామయ్యలు తనని ప్రోత్సహించి ఇండస్ట్రీలోకి పంపించారని తెలిపారు.
ఇక తనకు హీరోయిన్ గా అవకాశాలు వచ్చేటప్పటికి తనకు పిల్లలు కూడా పుట్టారని అయితే తన అత్తమామలు పిల్లలు పుట్టిన విషయాన్ని చెప్పొద్దు అని చెప్పిన తాను ఉన్న విషయాన్ని దర్శకనిర్మాతల వద్ద చెప్పడంతో తనకు హీరోయిన్ గా అవకాశాలు కూడా వెళ్లిపోయాయని తెలిపారు.

ఇక పలు సినిమాలలో హీరోయిన్ గా అవకాశాలు వచ్చిన తనకు దర్శక నిర్మాతలు ఎన్నో కండిషన్లు పెట్టారు.పొట్టి దుస్తులు వేసుకొని నటించమని చెప్పారు.స్విమ్ సూట్ వేసుకుని నటించాలని కండిషన్లు పెట్టారు.
ఇలాంటి కండిషన్లు పెట్టడంతో తాను వాటికి నో చెప్పడం వల్ల కూడా తాను ఎన్నో సినిమా అవకాశాలను కోల్పోయానని నటి సన ఈ సందర్భంగా తెలియజేశారు.ఇక తాను ముస్లిం కాబట్టి హిందూ దేవతల పాత్రలలో నటించకూడదని నేను ఎప్పుడూ ఆలోచించను.
నేను ముస్లిం అయినా హిందూ దేవుళ్లను పూజిస్తానని తెలిపారు.అందుకే శ్రీరామరాజ్యం( Sri Rama Rajyam )లో కైకేయి పాత్రలో నటించానని తెలిపారు.
ఆదిపరాశక్తి అమ్మవారి పాత్రలో కూడా నటించానని అమ్మవారి తనను కోరుకున్నప్పుడు కాదనడానికి నేనెవరు అంటూ ఈమె తెలిపారు.ఇలా తనకు కుల మతాలతో పట్టింపు లేదని తాను ఎక్కడికి వెళ్లినా ఇండియన్ అని గర్వంగా చెప్పుకుంటానని, తన పిల్లలకు కూడా అదే నేర్పించానని సన ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.







