ప్రధానిని ఎందుకు కలిసానంటే ..? అసలు విషయం చెప్పేసిన జగన్

కొద్దిరోజుల క్రితం వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోధి నే కలిశారు.అయితే జగన్ ఢిల్లీ పర్యటన ఇంత అకస్మాత్తుగా ఎందుకు పెట్టుకున్నారు.? అసలు దీని వెనక కారణాలు ఏమిటి అనేది అసెంబ్లీ సాక్షిగా చెప్పాలంటూ టిడిపి సభ్యులు సభలోనే జగన్ ను నిలదీశారు.ఇక టిడిపి అనుకూల మీడియా లో జగన్ ఢిల్లీ పర్యటనపై అనేక కథనాలు వెలువడ్డాయి.

 Why Did You Meet The Prime Minister Pictures That Tell The Real Story , Ap Cm Ja-TeluguStop.com

ముఖ్యంగా మాజీ మంత్రి , జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిపిఐ అధికారులు దూకుడు ప్రదర్శిస్తుండడం, ఈ కేసులో వైసిపి కడప ఎంపీ అవినాష్ రెడ్డిని( MP Avinash Reddy ) అరెస్ట్ చేసే అవకాశం ఉండడంతోనే ఆ అరెస్టును ఆపేందుకు జగన్ ఆకస్మికంగా ఢిల్లీ టూర్ పెట్టుకున్నారని కథనాలు వెలుపడ్డాయి.

Telugu Ap Asembly, Ap Cm Jagan, Jaganmeet, Modhi Jagan-Politics

రాజకీయంగాను ఢిల్లీ( Delhi ) పర్యటనపై అనేక విమర్శలు వ్యక్తం అవుతుండడం తో జగన్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో క్లారిటీ ఇచ్చారు.” పోలవరం ప్రాజెక్టు కోసమే తాను ప్రధానిని కలిశానని , జగన్ అసెంబ్లీ సమావేశాల్లో ఈరోజు జరిగిన బడ్జెట్ సమావేశాల్లో పోలవరం పై జరిగిన చర్చ లో జగన్ ప్రసంగించారు.గత టిడిపి ప్రభుత్వ హయాంలో పోలవరం పనులు అనాలోచిత నిర్ణయాలతో ముందుకు సాగాయి.

ఫలితంగా తీవ్ర నష్టం జరిగింది.వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఓ పద్ధతి ప్రకారం పనులు ముందుకు సాగుతున్నాయి.

ఇప్పటికే అప్సర్ కాపర్ డ్యాం పూర్తయింది.ప్రస్తుతం గోదావరి డెల్టాకు నీరు అందించాల్సిన పరిస్థితి ఉంది.

ఈ క్రమంలోనే పోలవరం( Polavaram ) ప్రాజెక్టు కోసమే ప్రధానిని కలిసా.ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం సహాయం కోసమే చర్చించా.

తాత్కాలిక పనుల కోసం 14 వేల కోట్లు అడిగాను ” అంటూ జగన్ మాట్లాడారు .

Telugu Ap Asembly, Ap Cm Jagan, Jaganmeet, Modhi Jagan-Politics

 పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఎల్లో మీడియా తప్పుడు కథనాలు ప్రచురిస్తుందని , డ్యామ్ ఎత్తు పై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని జగన్ మండిపడ్డారు.45.7 ఎత్తు వరకు డాం నిర్మాణం జరుగుతుంది అని, సిడబ్ల్యుసి సిఫార్సుల మేరకు తొలిదశలో 41.15 మీటర్ల వరకు కడతామని,     పోలవరంలో ప్రతి ముంపు కుటుంబానికి గతంలో ఇచ్చిన హామీ మేరకు పది లక్షల చొప్పున ఇచ్చి తీరుతామని జగన్ స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube