తెలుగు సినీ ప్రేక్షకులకు యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.జబర్దస్త్ యాంకర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న అనసూయ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
కాగా మొన్నటి వరకు యాంకర్ గా బుల్లితెర పై సత్తాని చాటిన అనసూయ( Anasuya bharadwaj, ) ప్రస్తుతం వెండితెరపై నటిగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది.అలా ప్రస్తుతం అనసూయ చేతిలో అరడజన్ కు పైగా సినిమాలు ఉన్నాయి.

ఇది ఇలా ఉంటే ఇటువంటి పరిస్థితులు ఎదురైనా కూడా ఎమోషనల్ అవ్వకుండా ధైర్యంగా నిలబడి, సోషల్ మీడియాలో కొన్ని వందల మంది ట్రూల్స్ చేసిన ఒక్క సమాధానంతో నోరు మూయించగలనటి అనసూయ.ఎప్పుడూ ఏ విషయంలో ఎమోషనల్ అవ్వని అనసూయ తాజాగా రంగమార్తాండ ప్రమోషనల్ ఈవెంట్లో కన్నీరు పెట్టుకుంది. క్రిష్ణవంశీ( Krishna Vamsi ) దర్శకత్వం వహించిన రంగమార్తాండ సినిమాలో అనసూయ ప్రకాష్ రాజ్,రమ్యకృష్ణ కూతురిగా నటించిన విషయం తెలిసిందే.ఈ సందర్భంగా స్టేజిపై అనసూయ ఎమోషనల్ అవుతూ.
రంగమార్తాండ సినిమాలో నటించాను.

నా జీవితానికి ఇది చాలు అంటూ బోరున ఏడ్చేసింది.అయితే అనసూయకు ఆ ఏడుపు సూట్ అవ్వలేదని చెప్పవచ్చు.కానీ అలా ఏడవడం వెనుక ఏదో కారణం ఉంది అని కొందరు అంటుండగా కేవలం ప్రమోషన్స్ కోసం మాత్రమే అనసూయ అలా నటించింది అలా ఎమోషనల్ అయినట్లు యాక్ట్ చేసింది అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో యశోద సినిమా సమయంలో సమంత( Samantha ) ఏ విధంగా అయితే ఎమోషనల్ అయినట్టు నటించిందో ఇప్పుడు అనసూయ కూడా అలాగే నటించింది అంటూ ట్రోలర్స్ ట్రోలింగ్స్ చేస్తున్నారు.ఇకపోతే అనసూయ ప్రస్తుతం పుష్ప 2, భోళా శంకర్ సినిమాలతో పాటు ఇంకా కొన్ని సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే.
అనసూయ కాల్ షీట్స్ కోసం నిర్మాతలు ఎదురుచూస్తున్నారు అంటే ఆమె ఎంత బిజీగా ఉందో అర్థం చేసుకోవచ్చు.







