ధమ్కీ బదులు ధమాకా చూపించిన థియేటర్ యాజమాన్యం.. గగ్గోలు పెడుతున్న ఫాన్స్!

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) దర్శకత్వంలో విశ్వక్, నివేతా పేతురాజు జంటగా నటించిన చిత్రం దాస్ కా ధమ్కీ(Das Ka Dhamki).ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులను సందడి చేస్తుంది.

 Instead Of Threats, The Theater Management Showed Dhamaka The Fans Are Gagging-TeluguStop.com

ఇకపోతే ఈ మధ్యకాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో వచ్చే సినిమాల విషయంలో చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా థియేటర్లో విడుదలైన మొదటి రోజు పెద్ద ఎత్తున ప్రేక్షకులు థియేటర్ కి వెళ్లి సినిమాలను చూస్తున్నారు.ఈ క్రమంలోనే విశ్వక్ నటించిన ఈ సినిమా ఉగాది పండుగ సందర్భంగా విడుదల కావడంతో ప్రేక్షకులు థియేటర్లకు చేరుకొని ఎంజాయ్ చేస్తున్నారు.

ఇకపోతే కొన్నిచోట్ల ఈ సినిమా విషయంలో ప్రేక్షకులకు తీవ్ర నిరాశ ఎదురయింది.ధమ్కీసినిమా చూడటం కోసం ఎంతో ఉత్సాహంగా థియేటర్లకు వెళ్ళగా అక్కడ ఈ సినిమాకు బదులు రవితేజ(Raviteja) హీరోగా నటించిన ధమాకా(Dhamaka) సినిమాని ప్రసారం చేయడంతో ఒక్కసారిగా ప్రేక్షకులు గగ్గోలు పెడుతున్నారు.మరి ఇలాంటి ఘటన ఎక్కడ జరిగింది అనే విషయానికి వస్తే.వైజాగ్(వైజాగ్) లోని సుకన్య థియేటర్లో ఈ ఘటన చోటుచేసుకుంది.ఈ థియేటర్ కి విశ్వక్ నటించిన ధమ్కీసినిమా చూడటం కోసం ప్రేక్షకులు ఎంతో ఉత్సాహంగా వెళ్లగా అక్కడ వారికి ధమాకా సినిమా చూపించారు.

ఇక టైటిల్ విషయంలో నిర్వాహకులు పొరపాటు పడ్డారా లేక ఫైల్ ని ప్లే చేయడంలో పొరబడ్డారో తెలియదు గానీ ‘ధమ్కీ’ బదులు రవితేజ ‘ధమాకా’ సినిమా వేయడంతో ఒకసారిగా ప్రేక్షకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఓరి దేవుడా సినిమానే మారిపోయింది అంటూ పెద్ద ఎత్తున కేకలు వేస్తూ గోల చేశారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ వీడియో వైరల్ గా మారింది.ఈ విధంగా ధమాకా సినిమా వేసేసరికి సోషల్ మీడియాలో మీమ్స్ తెగ వస్తున్నాయి.

చూసినవాళ్లందరూ తెగ నవ్వుకుంటున్నారు. ఇక ఈ రెండు సినిమాలలో హీరోలు ద్విపాత్రాభినయంలో నటించడం గమనార్హం.

ఇక ఈ రెండు సినిమాలకు రైటర్ ప్రసన్నకుమార్ కావడం మరొక విశేషం.మరి ఈ ఘటనపై హీరో విశ్వక్ ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube