సాధారణంగా చిన్నపిల్లలు చూడడానికి ఎంతో ముద్దుగా ఉంటారు.అయితే ఇలా చిన్నపిల్లలను చూస్తేనే మనకున్నటువంటి సమస్యలన్నీ మర్చిపోయి సరదాగా వారితో గడపడానికి ప్రతి ఒక్కరు ఆసక్తి చూపుతారు.
ఈ క్రమంలోనే చిన్న పిల్లలను చూడగానే ముద్దుగా అనిపిస్తే వారికి ముద్దులు పెట్టడం సర్వసాధారణం అయితే కొందరు మాత్రం చిన్నపిల్లలకు లిప్ కిస్(Lip Kiss) ఇస్తూ ఉంటారు.ఇది ఏ మాత్రం మంచిది కాదని పలువురు వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
అయితే తాజాగా బాలీవుడ్ నటి ఛవి మిట్టల్(Chavi Mittel) తన పిల్లలకు లిప్ కిస్ ఇచ్చారు.
ఇలా ఈమె తన పిల్లలపై ఉన్నటువంటి ప్రేమను తెలియజేస్తూ వారికి లిప్ కిస్ ఇవ్వడమే కాకుండా ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటోలు ఒక్కసారిగా వైరల్ అయ్యాయి.ఇక ఈ ఫోటోలు చూసినటువంటి నెటిజెన్స్(Netizens) తీవ్ర స్థాయిలో మండిపడుతూ నటి ఛవి మిట్టల్ ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే కొందరు పిల్లలకు లిప్ కిస్ ఇవ్వడం ఏంటి? అసలు ఏం నేర్పుతున్నారు? బుద్ధుందా? అంటూ పెద్ద ఎత్తున ఈమెపై మండిపడుతూ కామెంట్లు చేస్తున్నారు.
మరికొందరైతే ఇలా మీలో ఉన్నటువంటి బ్యాక్టీరియాను పిల్లలకు కూడా పంచుతున్నారా ఇది ఆరోగ్యపరంగా ఏమాత్రం మంచిది కాదు అంటూ ఈమెకు సలహాలు ఇస్తున్నారు.ఇలా తన గురించి పెద్ద ఎత్తున ట్రోల్స్ జరగడంతో ఛవి మిట్టల్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తన పిల్లలతో కలిసి దిగినటువంటి మరికొన్ని ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పిల్లలపై తనకు ఉన్నటువంటి ప్రేమను చూపించడానికి ఇదొక పద్ధతి అని తనని తానుసమర్థించుకుంటున్నారు.ప్రస్తుత ఈమె షేర్ చేసిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.