కొత్త ఎక్సైజ్ పాలసీ గురించి విన్నారా? ఒక్కో లిక్కర్ బాటిల్‌పై?

మందుబాబులకు హిమాచల్‌ ప్రదేశ్‌( Himachal Pradesh ) ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది.2023-24వ సంవత్సరానికిగాను రాష్ట్రంలో విక్రయించే మద్యం బాటిళ్లపై( liquor bottel ) రూ.10 సెస్ విధించాలని ప్రతిపాదించింది.దీని వలన రాష్ట్ర ఖజానాకు ఏటా రూ.100 కోట్లు వచ్చి పడతాయని అంచనా వేసింది.ఇకపోతే పాల ఉత్పత్తిదారుల ఆదాయాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆవు, గేదె పాలను కొనుగోలు చేయాలని నిర్ణయించుకోవడం తెలిసినదే.

 Heard About The New Excise Policy? On Each Bottle Of Liquor New Exchange Policy,-TeluguStop.com

హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్‌విందర్ సింగ్ సుఖూ, ఈ సందర్భంగా మాట్లాడుతూ… అధిక పాల ఉత్పత్తి ద్వారా పాల ఉత్పత్తిదారుల ఆదాయాన్ని పెంచడానికి వచ్చే ఆదాయాన్ని ఉపయోగిస్తామని చెప్పారు.

Telugu Bumper, Ganga, Latest, Liquor Bottel, Exchange Policy-Latest News - Telug

ఇకపోతే, మందుబాబులకు ఇది షాకిచ్చే న్యూస్‌ అని చెప్పుకోవాలి.హిమాచల్‌ అసెంబ్లీలో 2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.53,413 కోట్ల బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన సీఎం విద్యార్థులపై వరాల జల్లు కురిపించారు.ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న దాదాపు 20 వేలమంది బాలికలకు ఎలక్ట్రిక్‌ స్కూటీల కొనుగోలు నిమిత్తం ఒక్కొక్కరికి రూ.25,000 రాయితీ అందిస్తామని ప్రకటించడం విశేషం.అంతేకాకుండా 2,31,000 మంది మహిళలకు సామాజిక భద్రతా పింఛను కింద ప్రతినెలా రూ.1,500 నగదు అందిస్తామని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

Telugu Bumper, Ganga, Latest, Liquor Bottel, Exchange Policy-Latest News - Telug

కాగా ఈ రాష్ట్రంలో పాల ఆధారిత ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు “హిం-గంగా( Him- Ganga )” పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు కూడా ముఖ్యమంత్రి ప్రకటించి రైతులపాలిట వరాలదేవుడిగా మారారు.ఈ పథకం కింద, పశువులను పెంచే రైతులకు మంచి పాల ధరలు అందించబడతాయి.“హిమ్ గంగా” యోజన కోసం రూ.500 కోట్లు ఖర్చు చేస్తారని తెలుస్తోంది.మొదటి దశలో ఈ పథకంతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో రైతులు మరియు పశుపోషణను అనుసంధానించడం ద్వారా ఇది పైలట్ ప్రాతిపదికన ప్రారంభమవుతుందని తెలుస్తోంది.గతంలో జై రామ్ ఠాకూర్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో గోవుల అభయారణ్యాలు, గో సదన్‌ల నిర్వహణ కోసం ఒక్కో మద్యం బాటిల్‌పై రూ.1 చొప్పున సెస్ విధించారు.ఇప్పుడు.ఒక్కో మద్యం బాటిల్‌పై రూ.10 సెస్‌ విధించేందుకు సిద్ధం కావడం సర్వత్రా చర్చనీయాంశం అయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube