తారకరత్న( Tarakaratna ) మరణించి దాదాపుగా నెల రోజులు కాగా ఆయన మరణం సాధారణ అభిమానులను సైతం ఎంతగానో బాధ పెట్టింది.తారకరత్న మరణం తర్వాత అలేఖ్యారెడ్డి( Alekhya Reddy ) సోషల్ మీడియాలో పెట్టే ప్రతి పోస్ట్ హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే.
అలేఖ్యారెడ్డికి నందమూరి అభిమానుల సపోర్ట్ కూడా దక్కుతోంది.అలేఖ్యకు నందమూరి కుటుంబం ఆర్థికంగా భారీ మొత్తంలో సహాయం చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
అలేఖ్యా రెడ్డి తాజా పోస్ట్ లో బాలయ్య గురించి ఇంతకన్నా నేనేం చెప్పగలనని మీకు నా కృతజ్ఞతలు ఎలా తెలియజేయగలనని పేర్కొన్నారు.నేను ఏం చెప్పినా మీ ముందు తక్కువే అవుతుందని అలేఖ్య చెప్పుకొచ్చారు.
బాలయ్య( Balakrishna ) బంగారు హృదయం ఉన్న వ్యక్తి అని అలేఖ్య అభిప్రాయం వ్యక్తం చేశారు.మీరు నిజంగా ఆ పేరుకు అర్హులని మీలా మరెవరూ చేయలేరని అలేఖ్య అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.

మిమ్మల్ని ఓ తండ్రిగా స్నేహితుడిగా చూశామని ఇప్పుడు మీలో దేవుడిని చూస్తున్నామని అలేఖ్యారెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.మీ ప్రేమతో నాకు మాటలు రావడం లేదని మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు అని అలేఖ్య అభిప్రాయం వ్యక్తం చేశారు.మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో అంతకంటే ఎక్కువగా మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం అని అలేఖ్యారెడ్డి పోస్ట్ లో పేర్కొన్నారు.

బాలయ్య తమ కుటుంబం కోసం చేస్తున్న సహాయంను గుర్తు చేసుకుంటూ అలేఖ్య ఈ పోస్ట్ చేశారు.తారకరత్న పేరు చరిత్రలో నిలిచేలా బాలయ్య తీసుకుంటున్న నిర్ణయాల వల్ల అలేఖ్య ఈ పోస్ట్ పెట్టినట్టు తెలుస్తోంది.బాలయ్య గొప్పదనం గురించి ఎంత చెప్పినా తక్కువేనని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
అలేఖ్యారెడ్డి తారకరత్న చనిపోయారనే బాధ నుంచి త్వరగా కోలుకుని సాధారణ మనిషి కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.







