మన దేశంలో దాదాపుగా చిలుకలు( parrots ) అన్నీ సాధారణ పచ్చరంగులోనే ఉంటాయి.వీటిని మనుషులు చాలా ఇష్టంగా పెంచుకుంటారు కూడా.
పక్షుల్లో నిజానికి మనుషుల భాషను అర్ధం చేసుకునే సామర్ధ్యం చిలుకలకు మాత్రమే ఉంటుంది.అందుకే మనం మాట్లాడే పదాలను తిరిగి అప్పజెప్పడం, మనుషుల మాదిరి శబ్ధాలు చేయడం వంటివి ఇవి చేస్తుంటాయి.
ఇవి విత్తనాలు, కాయలు, పండ్లు, పువ్వులు, మొగ్గలు వంటి మొక్కల ఆధారిత ఆహారాలు మాత్రమే తింటూ ఉంటాయి.చిలుకల సగటు జీవితకాలం 50 ఏళ్లు.
ఇవి ప్రపంచంలోని అన్ని ఉష్ణమండల, శీతల ఖండాలలో కనిపిస్తాయి.
ఐతే ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లోని చిలుకలు పచ్చరంగులో మాత్రమే కాకుండా బులుగు, ఎరుపు, పసుపు, తెలుపు ఇలా అనేక రంగుల్లో కనిపిస్తూ ఉంటాయి.
తాజాగా బ్లూ రంగులో ఉన్న ఓ రామ చిలుక ముద్దు ముద్దుగా మాట్లాడటమేకాకుండా చిన్నచిన్న పేపర్ ట్రిక్స్ ( Paper tricks )కూడా చేస్తుంది.దీనిని సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైలర్ అవుతోంది.
వైరల్ అవుతున్న వీడియోని ఒకసారి నిశితంగా పరిశీలిస్తే… చిలుక తన ముందున్న దలసరి పేపర్‌ను ముక్కుతో కొరికి ముక్కలు చేయడం గమనించవచ్చు.

ఆ తరువాత పొడవుగా కట్ చేసిన పేపర్ ముక్కలను తన రెక్కల్లో దూర్చుకుని పొడవాటి ఈకలు మాదిరి చాలా అందంగా అమర్చుకోవడం చూడొచ్చు.తనకున్న ఈకలతో పాటు మరిన్ని పేపర్ ఈకలను తయారు చేసుకోవడం కూడా గమనించవచ్చు.ఎవరో ట్రైనింగ్ ఇచ్చి నేర్పించినట్టు చక్కగా ఆ చిలుక వాటిని కట్ చేయడం చూస్తే ఏదో పెయింటింగ్ చేసినట్టు కనబడుతోంది.
దాంతో నెటిజన్లు దాని చర్యకు విస్తుపోతున్నారు.అందుకే ఈ వీడియోకు మిలియన్లలో వీక్షణలు, లక్షల్లో లైకులు కామెంట్లు వస్తున్నాయి.







