వైరల్: ఐస్ క్రీమ్ రోల్ ఎపుడైనా తిన్నారా? లేదంటే ఇక్కడ చూడండి!

సాధారణంగా ఆహార ప్రియులు అనేవారికి వంట వండడం అనే విషయం కూడా చాలా కిక్కునిస్తుంది.సమయం చిక్కినప్పుడల్లా మనవాళ్ళు కొత్తకొత్త వంటలు కనిపెట్టి తమ టాలెంట్ తో ఎదుటివారిని మెప్పించాలని ఆరాటపడుతూ వుంటారు.

 Man Prepared Strange Ice Cream Rolls With Tea And Chocolate Details, Ice Cream,-TeluguStop.com

దీని కోసం ఏవేవో ప్రయోగాలు చేస్తూ వుంటారు.ఇక సోషల్ మీడియా( Social media ) వినియోగం పెరిగాక అలాంటివారు మరింత అలెర్ట్ అయ్యారు.

తాము కనిపెట్టిన వీడియోల్ని సోషల్ మీడియాలో షేర్ చేసి నెటిజన్లను ఖుషి చేస్తూ వుంటారు.దీంతో విచిత్రమైన ఫుడ్ వీడియోలు సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా కనిపిస్తూ ఉంటాయి.

ఈ క్రమంలోనే ఒక వీడియో ఆహుతులను బాగా అలరిస్తోంది.సదరు వీడియోని చూసిన కొందరు నెటిజన్లు పాజిటివ్ గా స్పందిస్తుంటే ఒంకొంతమంది మాత్రం నెగెటివ్‌గా స్పందించడం ఇక్కడ చూడవచ్చు.ఇంతకీ ఆ వీడియోని ఒకసారి చూస్తే, అది ఒక ఐస్ క్రీమ్ రోల్ కి( Ice cream roll ) సంబంధించినటువంటి వీడియో అని చాలా స్పష్టంగా అర్ధం అవుతోంది.సాధారణంగా రోల్స్ అనగానే నాన్ వెజ్, ఎగ్ రోల్స్, కొన్ని వెజ్ రోల్స్ మాత్రమే గుర్తొస్తాయి.

ఐస్ క్రీమ్‌తో రోల్స్ ఎవరూ తయారు చేయరు.

కానీ, ఇక్కడ ఒక ఆశాజీవి మాత్రం ఐస్ క్రీమ్‌తో( Ice cream ) రోల్స్ తయారు చేసి అమ్ముతున్నాడు.దీని తయారీకి టీ, మిల్క్, ఐస్ క్రీమ్ వాడడం ఇక్కడ చూడవచ్చు.అతగాడు మొదట పెనంపై టీ పోసి, తరువాత పాలు పోసి, చాక్లెట్ సిరప్ వేసి, తర్వాత ఐస్ క్రీమ్ వేసి, మిక్స్ చేసి ఐస్ క్రీమ్ రోల్స్ చాలా సునాయాసంగా తయారు చేస్తున్నాడు.

కాగా ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకవుతున్నారు.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.ఇంకెందుకాలస్యం, మీరు కూడా ఆ వీడియో తిలకించి మీమీ అభిప్రాయాలను తెలియజేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube