వామపక్షాలు పిలుపునిచ్చిన ఛలో విజయవాడ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది.విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం దగ్గర టెన్షన్ వాతావరణం ఏర్పడింది.
వామపక్ష నేతలతో పాటు వివిధ పార్టీలకు చెందిన నాయకులు, విద్యార్థి సంఘాలు ఈ కార్యక్రమానికి హాజరైయ్యాయి.రంగంలోకి దిగిన పోలీసులు నిరసనకారులను అడ్డుకోవడంతో వాగ్వివాదం చెలరేగింది.
మరోవైపు చలో విజయవాడ కార్యక్రమం నేపథ్యంలో ధర్నాచౌక్ కు ర్యాలీగా వెళ్తున్న అంగన్ వాడీ కార్యకర్తలను, వర్కర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.దీంతో హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది.







