ప్రస్తుతం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో( MLC Elections ) ఊహించని విధంగా తెలుగుదేశం పార్టీ( TDP ) మూడు స్థానాల్లో విజయం సాధించింది.ముందుగా రెండు ఫలితాలు టిడిపి ఖాతాలో పడినా, శనివారం అర్ధరాత్రి వెలువడిన పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలితాల్లో టిడిపి అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి( Bhumiredy ramgopal reddy ) గెలుపొందారు.
వైసీపీ అభ్యర్థి వెన్నుపూస రవీంద్రారెడ్డి పై 7543 ఓట్ల మెజార్టీతో రాంగోపాల్ రెడ్డి గెలుపొందారు.
మొత్తం ఈ ఎన్నికల్లో 49 మంది అభ్యర్థులు పోటీ చేసినా, చివరకు టిడిపి, వైసిపి అభ్యర్థుల మధ్య ప్రధానంగా పోటీ జరిగింది.
ఊహించని విధంగా టిడిపి అభ్యర్థి రామ్ గోపాల్ రెడ్డి విజయం సాధించారు.అయితే ఈ ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయని వైసిపి అభ్యర్థి వెన్నుపోస రవీంద్రారెడ్డి, వైసీపీ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి ఆందోళన చేపట్టారు.
రీకౌంటింగ్ చేయాలని డిమాండ్ చేస్తూ పోలింగ్ కేంద్రం వద్ద నిరసన తెలిపారు.

చివరకు ఫలితాలు వెలువడి టిడిపి అభ్యర్థి విజయం సాధించినట్లుగా ప్రకటన వెలువడింది.ఈ ఫలితాలపై టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu naidu ) వర్షం వ్యక్తం చేశారు.సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు టిడిపి తరఫున గెలిచిన అభ్యర్థులకు అభినందనలు తెలిపారు.
ఈ ఫలితాలు ప్రజావిజయం మార్పుకు సంకేతం అంటూ చంద్రబాబు అన్నారు.పట్టభద్రుల తీర్పు మంచికి మార్గం.
టీడీపీ అభ్యర్థులను గెలిపించిన ప్రజలకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.

వైసీపీ అక్రమాలకు ఎదురు నిలిచిన పార్టీ శ్రేణులకు సెల్యూట్ చేస్తున్నట్లు చంద్రబాబు అన్నారు. హిందూపురం టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ( Balakrishna ) ఈ ఎన్నికల ఫలితాలపై స్పందించారు.ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసిపిని తొక్కిపెట్టి నార తీశారన్నారు .ఈ ఫలితాలతో పులివెందుల కోటలకు బీటలు పడుతున్నాయని, త్వరలో ఆ బీటలు తాడేపల్లి ప్యాలెస్ వరకు చేరుతాయని బాలకృష్ణ అన్నారు. వై నాట్ 175 అని జగన్ అంటే ఇప్పుడు వినాలి ఉందంటూ బాలయ్య సెటైర్లు వేశారు.







