టూరిజం అంతరిక్షంలో అట... అందరూ ఆహ్వానితులే?

టెక్నాలజీ( Technology ) నేడు ఎంతలా పెరిగిపోతుందో అందరూ ప్రత్యక్షంగా చూస్తున్నారు.స్మార్ట్ ఫోన్స్ పుణ్యమాని చదువు వున్నారు, చదువు లేనివారు అనే తేడా లేకుండా అందరూ అనేక విషయాల గురించి ఒక అవగాహన అనేది కలిగి వుంటున్నారు.

 Isro Chairman Refutes Reports On Space Tourism In India At 6 Crore Per Seat,isro-TeluguStop.com

ఇక రోజు రోజుకు పెరిగిపోతున్న టెక్నాలజీ మనిషికి సాధ్యం కానిది అంటూ ఏది లేదు అని సుస్పష్టం చేస్తోంది.ఇలా పెరిగిపోయిన టెక్నాలజీని ఉపయోగించుకుంటున్న మనిషి ఏకంగా భూమ్మీద జీవించడం కాదు చంద్రమండలంపై జీవించేందుకు కూడా ఏర్పాట్లు చేసుకుంటున్న పరిస్థితి ఇపుడు కనిపిస్తూ ఉంది.

అవును, ఎన్నో దశాబ్దాలుగా మనిషి భూమిమీద కాకుండా ఇతర గ్రహాలపైన మనుగడ సాధ్యపడదా? అనే విషయంపైన అన్వేషణ చేస్తూ వస్తున్నాడు.

ఈ విషయాన్నే కొంతమంది తెలివిగలోళ్లు క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు.అవును, అలాంటి వారి కోసమే ఇప్పుడు ఒక అదిరిపోయే ఆఫర్ సిద్ధంగా ఉంది.ఏకంగా అంతరిక్షంలోకి వెళ్లి చుట్టేసేందుకు ఛాన్స్ మరికొన్ని రోజుల్లో అందుబాటులోకి రానుంది.అంతరిక్ష టూరిజం( Space Tourism ) ప్రారంభించేందుకు శాస్త్రవేత్తలు యత్నిస్తున్నారు.2030 లోపు ఇస్రో శాస్త్రవేత్తలు( ISRO Scientists ) ఇలా అంతరిక్ష టూరిజం అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

అంతరిక్షంలోకి టూరిస్ట్ గా వెళ్లాలని తహతహలాడొద్దు.ఎందుకంటే అది అంత సులభమైన విషయం కాదు.దానికోసం భారీగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది.ఎందుకంటే ఒక్కొక్క ప్రయాణికుడి నుంచి దాదాపు 6 కోట్ల రూపాయలు వసూలు చేయబోతున్నట్లు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ చైర్మన్ సోమనాథ్ ( ISRO Chairman Somanath ) తాజాగా వెల్లడించారు.

అయితే ఈ ధర ప్రపంచంలో ఉన్న స్పేస్ టూర్ ధరలతో పోల్చి చూస్తే చాలా తక్కువ అంటూ ఆయన చెప్పుకు రావడం కొసమెరుపు.ఏది ఏమైనా అంతరిక్ష టూరిజం అనే పదమే కాస్త కొత్తగా అనిపిస్తుంది కదా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube