నీ గుండెల్లో బాధ ఎవరికి అర్థం కాలేదు... అలేఖ్య రెడ్డి ఎమోషనల్ పోస్ట్!

నందమూరి తారకరత్న(Tarakaratna) అనారోగ్య సమస్యలతో బాధపడుతూ 23 రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఫిబ్రవరి 18వ తేదీ మరణించిన విషయం మనకు తెలిసిందే.అయితే ఈయన మరణించి సరిగ్గా నెల రోజులు కావడంతో తారకరత్న సతీమణి అలేఖ్య రెడ్డి (Akekhya Reddy) సోషల్ మీడియా వేదికగా తన భర్త మరణాన్ని తలుచుకుంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.

 Who Doesnt Understand The Pain In Your Heart Alekya Reddys Emotional Post, Tarak-TeluguStop.com

ఈ సందర్భంగా ఈమె చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.నువ్వు మమ్మల్ని వదిలేసి నేటికి సరిగ్గా నెలరోజులు అవుతుంది.

కానీ నీ జ్ఞాపకాలు మాత్రం మమ్మల్ని దహించి వేస్తున్నాయి అంటూ ఎమోషనల్ అయ్యారు.

మన పరిచయం స్నేహంగా మారి ఆ స్నేహం ప్రేమగా మారిన నేను కాస్త బెరుకుగా ఉన్నప్పటికీ మనం కలిసి జీవించబోతున్నాం అని నమ్మకంతో నువ్వున్నావ్.అప్పటినుంచి ఆ క్షణం కోసం ఎంతో పోరాడి చివరికి మన పెళ్లి జరిగింది.ఇలా మన వివాహం ఎంతో గందరగోళంగా ఉన్నప్పటికీ నువ్వు మాత్రం నాతో ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉన్నాను.

ఇక నిషికమ్మ పుట్టిన తర్వాత మన జీవితమే మారిపోయింది.ఆనందం రెట్టింపు అయినప్పటికీ కష్టాలు అలాగే ఉన్నాయి.మన జీవితంపై చిమ్ముతున్న ద్వేషాన్ని తగ్గించుకోవడం కోసం మనం కళ్ళకు గంతులు కట్టుకొని బ్రతికాము.నన్ను పెళ్లి చేసుకుని నీ కుటుంబానికి దూరమయ్యావు కనక పెద్ద కుటుంబం ఉండాలనే భావించావు.

మనకు కవలలు పుట్టిన తర్వాత నీ కోరిక నెరవేరిందని సంతోషించావు.

నువ్వు నీ చివరి శ్వాస వరకు ఎంతో కష్టపడుతూ పోరాటం చేసావు.కానీ నీ గుండెల్లో ఉన్నటువంటి బాధ ఎవరికి అర్థం కాలేదు.అయినవాళ్లే పదేపదే గాయం చేస్తూ ఉన్న ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో నేను ఉన్నాను.

మన ప్రయాణంలో మనకు మొదటి నుంచి చివరిగా సపోర్ట్ ఉన్న వారిని కూడా కోల్పోయాము.చివరికి నిన్ను కూడా కోల్పోయాను నువ్వు రియల్ హీరో.నిన్ను చూసి మేమంతా గర్విస్తున్నా…నిన్ను మళ్ళీ కలుస్తానని ఆశిస్తున్నా అంటూ తన భర్త మరణాన్ని తలుచుకుంటూ తాను అనుభవించిన కష్టాలను గుర్తు చేసుకుంటూ ఈమె ఎమోషనల్ పోస్ట్ చేశారు.ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube