మంత్రి కేటీఆర్ పై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వెనుక కేటీఆర్ ఉన్నారని ఆరోపించారు.
అందుకే సీఎం కేసీఆర్ ఈ పేపర్ లీక్ వ్యవహారంపై స్పందించడం లేదని మండిపడ్డారు.అనంతరం టీఎస్పీఎస్సీని ఎందుకు రద్దు చేయడం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
ఈ నేపథ్యంలో టీఎస్పీఎస్సీని రద్దు చేసి సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా కేటీఆర్ ను బర్తరఫ్ చేయాలన్న రేవంత్ రెడ్డి పేపర్ లీక్ ఘటనపై గవర్నర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
ఈ క్రమంలోనే పేపర్ లీక్ ఘటనపై 21న గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు.







