యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు ( Jr NTR ) ఒకప్పుడు బాబాయ్ బాలయ్య సపోర్ట్ బాగానే దక్కినా ప్రస్తుతం బాలయ్య ( Balakrishna ) జూనియర్ ఎన్టీఆర్ మధ్య గ్యాప్ ఉందని పొలిటికల్, సినీ, మీడియా వర్గాల్లో టాక్ నడుస్తోంది.ఆకాశమే హద్దుగా క్రేజ్ ను సొంతం చేసుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రతి ప్రాజెక్ట్ ప్రత్యేకంగా ఉండేలా కచ్చితంగా అంచనాలను అందుకోవడంతో పాటు సక్సెస్ సాధించేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.
అయితే జూనియర్ ఎన్టీఆర్ కు కెరీర్ పరంగా అన్ని వ్యవహారాలను చక్కబెట్టే విషయంలో మరొక వ్యక్తి సపోర్ట్ అవసరమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఇతర హీరోలకు వాళ్ల భార్య నుంచి, స్నేహితుల నుంచి సపోర్ట్ లభిస్తుండగా తారక్ కు మాత్రం ఈ విషయంలో సమస్యలు ఎదురవుతున్నాయి.
ఎన్టీఆర్ సినిమాల అప్ డేట్స్ విషయంలో కన్ఫ్యూజన్ నెలకొనడానికి కూడా ఇదే కారణమని ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం.
సోషల్ మీడియాపై ఇతర స్టార్స్ ఫోకస్ పెట్టిన స్థాయిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ దృష్టి పెట్టడం లేదు.పాన్ ఇండియా ఇమేజ్ మరింత పెరగడంతో పాటు మరిన్ని ఇండస్ట్రీ హిట్లు ఖాతాలో చేరాలంటే ఏ విషయంలోనూ తారక్ పొరపాట్లు చేయకూడదు.ఊహించని స్థాయిలో ఫ్యాన్ బేస్( NTR Fans ) తారక్ సొంతం కాగా ఎన్టీఆర్ తో ఒక్క సినిమా అయినా చేయాలని క్యూ కడుతున్న వాళ్ల జాబితా అంతకంతకూ పెరుగుతోంది.
జూనియర్ ఎన్టీఆర్ ఇతర హీరోలకు సోషల్ మీడియా విషయంలో, నెగిటివ్ కామెంట్లకు జవాబిచ్చే విషయంలో, ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకునే విషయంలో గట్టి పోటీ ఇవ్వాల్సి ఉంది.యంగ్ టైగర్ ఎన్టీఆర్ కార్పొరేట్ పీఆర్ స్కిల్స్ ను వాడాల్సిన అవసరం ఉందని అందుకు సరైన వ్యక్తి కావాలని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం మాస్ సినిమాలపై దృష్టి పెట్టగా ఈ స్టార్ హీరో రెమ్యునరేషన్ ప్రస్తుతం 100 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.