రంగమార్తాండ వారి కోసమేనా.. కమర్షియల్‌ సినిమాగా నిలిచేనా? లేదా?

క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ( Krishna vamshi ) నాలుగు సంవత్సరాలు కష్టపడి రూపొందించిన రంగమార్తాండ సినిమా ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ముఖ్య పాత్ర లో నటించిన ఈ సినిమా లో శివాత్మిక రాజశేఖర్‌, రాహుల్ సిప్లిగంజ్, బ్రహ్మానందం ఇంకా ఎంతో మంది ముఖ్య నటీనటులు నటించారు.

 Krishna Vamshi Rangamarthanda Movie Class Movie Or Commercial Movie , Krishna Va-TeluguStop.com

మరాఠీ చిత్రం నట సామ్రాట్ కి ఇది రీమేక్ అనే విషయం తెలిసిందే.తెలుగు నేటివిటీ కి తగ్గట్లుగా ఈ సినిమా ని రూపొందించారు.

మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్‌ ఇవ్వడంతో పాటు ఎంతో మంది ప్రముఖులు ఈ సినిమా కోసం గెస్ట్‌ అప్పియరెన్స్‌ ఇచ్చారు.కనుక ఈ సినిమా తప్పకుండా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ సినిమా కమర్షియల్ సినిమాగా సక్సెస్ అవుతుందా అనే అనుమానాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు.

కమర్షియల్ సినిమా అన్నట్లుగా కాకుండా క్లాస్ సినిమాలను మాత్రమే ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుందేమో అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఒకవేళ క్లాస్ సినిమాలను నచ్చే వారికి మాత్రమే ఈ సినిమా నచ్చితే కమర్షియల్ గా కచ్చితంగా సినిమా ఎక్కువ లాభాలను సొంతం చేసుకోక పోవచ్చు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.మొత్తానికి రంగమార్తాండ సినిమా విడుదల తేదీ ప్రకటించిన తర్వాత ఆసక్తికర చర్చ జరుగుతోంది.

కృష్ణవంశీ చాలా కాలంగా సరైన సక్సెస్ కోసం వెయిట్‌ చేస్తున్నాడు.అదుగో ఇదుగో అంటూ వాయిదాల మీద వాయిదాలు వేస్తూ ఈ సినిమా ను జరుపుతూ వచ్చాడు.కాస్త ఎక్కువ శ్రద్ద తీసుకుని సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు గాను ప్లాన్ చేశాడు.అయితే ఈ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలంటే ఈ నెల 22 వరకు వెయిట్‌ చేయాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube