టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో ఊహించని స్థాయిలో పాపులారిటీని కలిగి ఉన్న నటులలో రానా( Rana ) ఒకరనే సంగతి తెలిసిందే.తాజాగా రానా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
చరణ్( Charan ) నుంచి ఇతరులకు సహాయం చేసే గుణాన్ని పొందాలని నేను భావిస్తున్నానని రానా తెలిపారు.చరణ్ ఇతరులకు సాయం చేస్తాడని రానా చెప్పకనే చెప్పేశారు.
ప్రభాస్( Prabhas ) నుంచి గుడ్ తీసుకోవాలని అనుకుంటున్నానని రానా చెప్పుకొచ్చారు.జూనియర్ ఎన్టీఆర్ ( Junior NTR )నుంచి భాష నేర్చుకునే నైపుణ్యాన్ని సొంతం చేసుకోవాలని అనుకుంటున్నానని ఆయన కామెంట్లు చేశారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఏ భాషనైనా సులువుగా నేర్చుకుంటాడని రానా చెప్పుకొచ్చారు.చైనీస్ భాషను సైతం 20 నిమిషాలలో నేర్చుకునే ప్రతిభ తారక్ కు ఉందని రానా పేర్కొన్నారు.
జూనియర్ ఎన్టీఆర్ కు తెలుగు, హిందీ, తమిళంతో పాటు కన్నడ, హిందీ వచ్చని రానా అన్నారు.

ఇంగ్లీష్ లో సైతం తారక్ అద్భుతంగా మాట్లాడతారు.మాస్ రోల్స్ అయినా క్లాస్ రోల్స్ అయినా అద్భుతంగా పోషిస్తూ తారక్ ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు.జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు జరగనున్న దాస్ కా ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరు కానున్నారు.
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ అంటూ నెటిజన్లు చేస్తున్న పోస్టులు తెగ వైరల్ అవుతున్నాయి.జూనియర్ ఎన్టీఆర్ కు నటుడిగా రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది.

విభిన్నమైన కథలను ఎంచుకుంటున్న తారక్ విభిన్నమైన పాత్రలకు ఓటేస్తున్నారు.నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డ్ తో ఎన్టీఆర్ పేరు మరోసారి మారుమ్రోగుతోంది.జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ పరంగా ఇతర దేశాల్లో కూడా సంచలనాలు సృష్టించాలని అభిమానులు భావిస్తుండటం గమనార్హం.త్వరలో ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీ షూట్ మొదలుకానుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.







