ఒక్కో సినిమాను ఎంత భారీ స్థాయిలో నిర్మించిన కూడా హైప్ తెచ్చుకోవడంలో మాత్రం విఫలం అవుతుంది.అందుకు మేకర్స్ తప్పు కూడా ఒక కారణం అనే చెప్పాలి.
ఈ రోజుల్లో ప్రమోషన్స్ ఎంత చేస్తే ఓపెనింగ్స్ అంత కొల్లగొట్టవచ్చు.అందుకే మేకర్స్ సినిమాలో పస లేకపోయిన ప్రమోషన్స్ చేస్తూ సినిమాను ఆడియెన్స్ కు మరింత చేరువ చేయడానికి ప్రయత్నిస్తారు.
అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వంటి క్రేజ్ ఉన్న వ్యక్తి తమ సినిమాకు సపోర్ట్ చేస్తున్న కూడా ఆయన క్రేజ్ ను వాడుకోలేక పోతున్నారు.మరి ఇంతకీ ఆ సినిమా ఏంటంటే.
కబ్జ (Kabzaa). కన్నడ స్టార్ హీరోలు కిచ్చా సుదీప్, రియల్ స్టార్ ఉపేంద్ర( Kichcha Sudeep Upendra ) ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఉగాది కానుకగా ఈ రోజు గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.

ఈ మధ్య కన్నడ సినిమాలకు ఎక్కువ డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే.మరి ఈ సినిమా ఈ ఇద్దరు స్టార్స్ నటించడం వల్ల సినిమా స్టార్టింగ్ అప్పటి నుండి మంచి అంచనాలు నెలకొల్పాయి.అయితే అనూహ్యంగా రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ ఈ సినిమాకు క్రేజ్ తేవడంతో మేకర్స్ విఫలం అయ్యారు.కేజిఎఫ్ సిరీస్ తర్వాత మళ్ళీ అంతటి ట్రీట్ ఇస్తారనేలా మొదట్లో ఆసక్తి రేపింది.

కానీ సరైన ప్రమోషన్స్ లేక సాధారణ రిలీజ్ గానే వచ్చింది.ఈ సినిమా యూనిట్ కు ముందు నుండి పవర్ స్టార్ సపోర్ట్ ఉన్నప్పటికీ తెలుగులో ఈయన క్రేజ్ ను మార్కెట్ చేయలేక పోయారు.తాజాగా డైరెక్టర్ చంద్రు పవన్ ను కలిసి ఆయన తమ సినిమాకు ఎంతో సపోర్ట్ ఇచ్చారని షేర్ చేయడం వైరల్ అయ్యింది.పవర్ స్టార్ (Pawan Kalyan) లాంటి వ్యక్తి సపోర్ట్ ఉన్న ఇవేమీ జనాలకు తెలియ పరచడంలో పూర్తిగా విఫలం అయ్యారు.
అదే పవన్ కళ్యాణ్ క్రేజ్ ను గట్టిగ ప్రమోషన్స్ చేసి ఉంటే మరింత హైప్ సినిమాకు వచ్చి ఉండేది.







