టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వెంకటేష్ మహా( Venkatesh Maha ) వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.వెంకటేష్ చేసిన వ్యాఖ్యలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో దుమారం రేపాయి.
మంచి సినిమాలు చేసే మాకన్నా, ఒక నిచ్ కమీన్ గాడిని హీరోగా చూపించే దర్శకులకు ఎక్కువ మార్కులు వేస్తున్నారు అంటూ కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.కాగా వెంకటేష్ మహా చేసిన వాఖ్యలపై ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో పలువురు సెలబ్రెటీలు స్పందిస్తూ వెంకటేష్ మహా పై మండిపడిన విషయం తెలిసిందే.
ఇది ఇలా ఉంటే తాజాగా నేచురల్ స్టార్ నాని( Nani ) కూడా రియాక్ట్ అయ్యాడు.కాగా నాని ప్రస్తుతం దసరా మూవీ ప్రమోషన్స్ లో ఉన్న విషయం తెలిసిందే.

సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే పలు ఇంటర్వ్యూలకు కూడా హాజరవుతున్నారు నాని.ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.వేంకటేష్ మహా కమర్షియల్ సినిమాలు గురించి కాంట్రవర్సీ కామెంట్స్ చేయగా ఆ సమయంలో అక్కడే ఉన్న నందిని రెడ్డి, ఇంద్రగంటి మోహనకృష్ణ, శివ నిర్వాణ, వివేక్ ఆత్రేయ దర్శకులు కూడా వెంకటేష్ కి అడ్డుచెప్పకపోగా ఆ కామెంట్స్ అంగీకరించారు.ఆ మద్దతు తెలిపిన నలుగురు దర్శకులు మీతో సినిమాలు చేసిన వారే.
ఈ కాంట్రవర్సీ పై మీ కామెంట్స్ ఏంటి అంటూ సదరు విలేకర్ నానిని ప్రశ్నించగా ఆ విషయం పై స్పందించిన నాని మనం సినిమా చూసి వచ్చాక ఫ్రెండ్స్ దగ్గర ఒకలా మాట్లాడతాం.

అదే మీడియా ముందుకు వచ్చాకా, కొంచెం జాగ్రత్తగా మాట్లాడతాం.ఆ కాంట్రవర్సీలో ఆ జాగ్రత్త మిస్ అయ్యింది అనుకుంటున్నాను.వాళ్లంతా ఏదో ఒక టాపిక్ మీద మాట్లాడుతూ, అది వేరే లెవెల్ కి వెళ్లిపోయింది.
వారి మాటలు ఎలా ఉన్నా సరే, నేను ఆ ఒక్క మాట పట్టుకొని వాళ్ళని తప్పుబట్టను.ఎందుకంటే అక్కడ ఉన్న నందిని రెడ్డి, ఇంద్రగంటి మోహనకృష్ణ, శివ నిర్వాణ, వివేక్ ఆత్రేయ మాస్ సినిమాలు చూసి విజుల్స్ వేయడం నేను చాలాసార్లు చూశాను.
నా ముందే కేజీఎఫ్ ( KGF ) గురించి మాట్లాడుతూ ఏమి ఎడిటింగ్ చేశాడు అంటూ పొగిడారు అని చెప్పుకొచ్చాడు నాని.







