రాబోయే తెలంగాణ ఎన్నికల్లో ఏ ముఖ్య నేత ఎక్కడి నుంచి పోటీ చేస్తారని ఆసక్తి అందరిలోనూ నెలకొంది.కొంతమంది కొన్ని కొన్ని నియోజకవర్గాలను కంచుకోటలుగా మార్చుకున్నారు .
రాబోయే ఎన్నికల్లో అక్కడినుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ( Revanth Reddy )విషయాన్నే తీసుకుంటే.
ప్రస్తుతం ఆయన మల్కాజ్ గిరి ఎంపీగా ఉన్నారు.రాబోయే ఎన్నికల్లో మల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిలోని ఏదో ఒక అసెంబ్లీ స్థానం నుంచి రేవంత్ పోటీ చేస్తారని అంతా భావించారు.
దీనికి తగ్గట్లుగానే తెలంగాణ కాంగ్రెస్ వ్యూహా కర్త సునీల్ కానుగోలు( Sunil ) కూడా మల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిలోని ఏదో ఒక నియోజకవర్గంలో నుంచి పోటీ చేస్తే, ఆ ప్రభావం ఆ పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్ని అసెంబ్లీ స్థానాల పైన ఉంటుందని సూచించారు.

కానీ రేవంత్ మాత్రం కొడంగల్( Kodangal ) నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఫిక్స్ అయిపోయారు.2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో రేవంత్ కొడంగల్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓటమి చెందారు.అక్కడ బీఆర్ఎస్ తరఫున నరేందర్ రెడ్డి ( Narender Reddy )పోటీ చేశారు.
రేవంత్ ను ఓడించేందుకు బీఆర్ ఎస్ సర్వసక్తులు ఉపయోగించడంతో, రేవంత్ కు పరాభవమే ఎదురయింది.ఇక ఆ తరువాత మల్కాజ్ గిరి ఎంపీగా పోటీ చేసి రేవంత్ గెలిచారు.
అయితే కొడంగల్ నియోజకవర్గం బాధ్యతలను తన సోదరుడు తిరుపతిరెడ్డికి రేవంత్ అప్పగించారు.దీంతో తిరుపతిరెడ్డి పూర్తిగా కొడంగల్ నియోజకవర్గంలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ.
పార్టీని బలోపేతం చేస్తూ వస్తున్నారు.దీంతో తిరుపతిరెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని అంతా భావిస్తుండగా.
రేవంత్ ఇప్పుడు కొడంగల్ పైన దృష్టి సారించారు.అక్కడి నుంచే అసెంబ్లీకి పోటీ చేసి గెలవాలని చూస్తున్నారు.
కాంగ్రెస్ ఇక్కడ బలంగా ఉండడం , తన కేడర్ కూడా చెక్కుచెదరకపోవడం ఇవన్నీ లెక్కలు వేసుకుంటున్నారట.

అయితే వ్యూహకర్త సునీల్ కానుగోలు సర్వే ప్రకారం మల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిలోని ఉప్పల్ , ఎల్బీనగర్ , మేడ్చల్, కల్వకుర్తి నియోజకవర్గం లో ఏదో ఒక దాని నుంచి పోటీ చేయాలని సూచించినా రేవంత్ మాత్రం కొడంగల్ వైపే చూస్తున్నారట.ఎల్బీనగర్ లో రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా ఉండడం, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ కు ఇక్కడి నుంచి మెజార్టీ లభించడం, ఇవన్నీ సానుకూల అంశాలుగా సునీల్ కానుగోలు చెబుతున్నా.రేవంత్ మాత్రం కొడంగల్ నుంచి పోటీ చేసేందుకు ఫిక్స్ అయిపోయారట.