తాను జరగాలని కోరుకున్న ఎలాంటి పని అయినా తాను సీన్ లోకి ఎంటర్ అవ్వకుండా నెరవేర్చుకునే రాజకీయ చాణిక్యం కేసిఆర్ ( KCR ) సొంతం.ఎలాంటి వారినైనా లొంగ తీసుకోవడానికి అవసరమైన వ్యూహాన్ని ఎప్పటికప్పుడు సిద్ధం చేసుకుంటూ తన అనుచరులు చేతే దానిని నిర్వహిస్తూ తాను కోరుకున్న వాతావరణాన్ని సిద్ధం చేసుకోగల అపర మేధావి కేసిఆర్.
మరి అలాంటి మేధావికి సైతం గడ్డుకాలం నడుస్తుందా అంటే అవుననే చెప్పాలి.ఒకపక్క కేంద్రంతో సిగ పట్లు పడుతుంటే మరొక పక్క గవర్నర్ తో పేచీలు .ఇది చాలదన్నట్లు ఇప్పుడు టి పి ఎస్ ఎస్ సి వ్యవహారం ఇలా కేసీఆర్ని అష్టదిగ్బంధనానికి గురి చేసే విధంగా పరిణామాలు మారుతున్నాయి…
తనపై ఎన్ని ఆరోపణలు వచ్చినా కనీసం ఖండించకుండా ఫార్మ్ హౌస్ లో ఉండటం ,ఆ ఆరోపణలు వీగిపోయేలా వెనక నుండి చక్రం తిప్పడం కేసీఆర్ సాధారణంగా పాటించే వ్యూహం .అసలు తనని ఇబ్బంది పెట్టే శక్తి ప్రతిపక్షాలకు లేదన్న అభిప్రాయాన్ని కలిగించడం కోసం ఆయన అసలు ఆరోపణలు పట్టించుకోకుండా సైలెంట్ గా ఉంటారని ఆయన అనునయులు చెప్పే మాట.కానీ కుమార్తె కవిత( MLC Kavitha ) విషయంలో మాత్రం ఆయన తన పూర్తిస్థాయి శక్తి సామర్ధ్యాలను ప్రయోగిస్తున్నారని చెప్పాలి .తనని ఇబ్బంది పెట్టి ఏ విషయంలోనైనా ఆయన మొదట ఆయన మేనల్లుడు హరీష్ రావు ని ఉపయోగిస్తారు.పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరు పొందిన హరీష్ రావు( Harish Rao ) మేనమామకు అవసరమైన విధంగా పరిస్థితులు చక్కబెడతారని పేరు ఉంది.

ఇప్పుడు మేనల్లుడు తో పాటు సమర్థుడిగా పేరుపొందిన కేటీఆర్ ని ( KTR ) కూడా పూర్తిస్థాయిలో ఇన్వాల్వ్ చేసినా కూడా అనుకున్న స్థాయిలో ఫలితం రావడం లేదు .కోర్టులను ఆశ్రయించినా కూడా ఇది దేశానికి సంబంధించిన అత్యున్నత స్థాయి విచారణ సంస్థలు నిర్వహిస్తున్న కేసులైనందువల్ల కోర్టు లు కూడా మధ్యలో కలగ చేసుకోవడానికి ఇష్టపడటం లేదు.ఇటువైపు చూస్తే రోజురోజుకీ టి పి ఎస్ ఎస్ సి వ్యవహారం ముదురుతుంది.
ఉద్యోగార్ధులు తో పాటు సామాన్య ప్రజలలో కూడా ఈ విషయం లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది.

మరొక పక్క కన్న కూతురు వ్యవహారం అవ్వడం వల్ల మానసికంగా కూడా ప్రశాంతత కరువవుతుంది… ఇలా ఈ పరిణామాలు చూస్తున్నప్పుడు ఎంత రాజకీయ దురందరుడికైనా కాలం కలిసి రాకపోతే ఫలితాలు అనుకూలంగా ఉండవని అలాంటప్పుడు ఎంత కృషి చేసినా వ్యర్ధమే అని ఇప్పుడు కేసీఆర్ ఎదుర్కుంటున్న పరిస్థితులు చూస్తే అర్థమవుతుంది.ఏది ఏమైనా పూర్తిస్థాయిలో కేంద్రంపై యుద్ధం ప్రకటించిన కేసీఆర్ ఎలా అయినా చివరి వరకు పోరాడి కేంద్రంపై పట్టు సాధించాలని కృత నిశ్చయం తో ఉన్నారని విశ్లేషణలు వినపడుతున్నాయి మరి ఈ ప్రయత్నంలో కేసీఆర్ విజయం సాధిస్తారో లేదో కాలం నిర్ణయిస్తుంది.







