రజినీ కాంత్( Rajinikanth ) హీరోగా సురేష్ కృష్ణ దర్శకత్వం లో వచ్చిన బాబా సినిమా( Baba ) బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ అయింది నిజానికి ఈ సినిమా లో రజినీకాంత్ చాలా అద్బుతం గా నటించాడు ఈ సినిమా కథ కూడా రజినీకాంత్ గారే రాశారు.

ఈ సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా రజినీకాంత్ చాలా స్టైలిష్ గా ఎనర్జిటిక్ గా ఉంటాడు.అలాగే ఈ సినిమాలో అన్ని సాంగ్స్ చాలా బాగుంటాయి కానీ ఈ స్టోరీ లో కొన్ని మిస్టేక్స్ ఉన్నట్టు గా తెలుస్తుంది ఏంటంటే రజినీకాంత్ కి ఒకానొక ఒక టైం లో కొన్ని వరాలు వస్తాయి వాటిని వాడుకొడానికి ఆయన అనవసరపు వృధా ప్రయాసలు చేస్తూ ఉంటాడు దానితో ఈ సినిమా చూసే ఆడియన్స్ కి అదేంటి ఈ కథ ఎటు పోతుంది అనే ఒక డౌట్ వస్తుంది…దాంతో ఈ సినిమా చూసే ఆడియన్స్ కి సినిమా మీద క్లారిటీ కూడా మిస్ అవుతుంది.

సినిమా మొత్తం రజినీకాంత్ ఎలివేషన్స్ చాలా అద్బుతం గా ఉంటాయి.స్టోరీ లో కొన్ని చిన్నపాటి మార్పులు కనక చేసి ఉంటే ఈ సినిమా కూడా భాష, నరసింహ సినిమాలా లాగా బ్లాక్ బస్టర్ హిట్ అయి ఉండేది.అందుకే అందరూ ఎప్పుడు ఈ సినిమా విషయంలో రజినీకాంత్ ఇంకా కొంచం జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది అని ఆయన ఫ్యాన్స్ తో పాటు సినీ జనాలు కూడా అభిప్రాయాలని వ్యక్తం చేశారు… అలా ఒక సూపర్ హిట్ పడాల్సిన సినిమా ప్లాప్ అయ్యింది…ఈ సినిమా హీరోయిన్ గా చేసిన మనీషా కోయిరాలా( Manisha Koirala ) యాక్టింగ్ కూడా బాగుంటుంది…ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రజినీకాంత్ ఒకటి అర సినిమాలు చేస్తూ బిజీ గా ఉన్నాడు ఇంతకు ముందులా రజినీకాంత్ ఫాస్ట్ గా సినిమాలు తీయడం లేదు ఎందుకంటే ఇప్పటికే ఆయనకి 70 సంవత్సరాల పైన వయసు ఉండటం తో ఆయన ఫాస్ట్ గా సినిమాలు చేయలేకపోతున్నారు…








