తెలంగాణలో అకాల వర్షాలు కురుస్తున్నాయి.ఉత్తర – దక్షిణ ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వడగండ్ల వానలు పడ్డాయి.
హైదరాబాద్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో వడగండ్ల వాన కురిసింది.మరికొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది.
అయితే ఈనెల 18న భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.దాదాపు ఐదు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ హెచ్చరిక కేంద్రం తెలిపింది.