ఏపీ వార్షిక బడ్జెట్ సామాన్య ప్రజల సంక్షేమ బడ్జెట్ అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.సీఎం జగన్ కి సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లు అని చెప్పారు.
బడ్జెట్ లో విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు.రూ.2,79,279 కోట్లతో రూపొందించిన వార్షిక బడ్జెట్ లో సెకండరీ ఎడ్యుకేషన్ కోసం రూ.29,690.71కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు.అదేవిధంగా జగనన్న విద్యాదీవెన రూ.2,841.64 కోట్లు కేటాయింపులు జరిగాయని మంత్రి బొత్స స్పష్టం చేశారు.







