సలార్ షూట్ అప్డేట్.. ప్రెజెంట్ ఎక్కడ జరుగుతుందంటే?

బాహుబలి( Bahubali ) సిరీస్ గురించి తెలియని ఇండియన్ ప్రేక్షకులు లేరు.ఈ సిరీస్ తో ఒక్కసారిగా పాపులర్ అయ్యి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.

 Prabhas Salaar Shooting Update, Salaar, Prabhas, Prashanth Neel, Salaar Shoot Up-TeluguStop.com

( Prabhas ) మరి ఇంతటి భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న తర్వాత ప్రభాస్ వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయ్యాడు.దీంతో ఈయనతో సినిమాలు చేసేందుకు పాన్ ఇండియన్ వ్యాప్తంగా ఉన్న డైరెక్టర్లు పోటీ పడ్డారు.

మరి ఈ క్రమంలోనే ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాల్లో ‘సలార్‘( Salar ) ఒకటి.ఈ సినిమాను కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

మిగతా సినిమాల కంటే ఈ సినిమాపై డార్లింగ్ ఫ్యాన్స్ ఎక్కువ హోప్స్ పెట్టుకున్నారు.ఎందుకంటే కెజిఎఫ్ సినిమాతో సంచలన విజయం అందుకున్న నీల్ తర్వాత చేస్తున్న సినిమా ఇదే కావడంతో ఈ సినిమా కూడా సంచలన విజయం అవుతుంది అని బలంగా నమ్ముతున్నారు.

సెప్టెంబర్ 28న రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ కూడా చేసారు.దీంతో శరవేగంగా షూటింగ్ జరుపు తున్నారు.ఇదిలా ఉండగా ఈ సినిమా షూట్ గురించి ఇప్పుడు ఆసక్తికర అప్డేట్ వచ్చింది.ఈ సినిమా షూటింగ్ ప్రెజెంట్ ఇటలీలో ఫుల్ స్వింగ్ లో చేస్తున్నారట.ఇప్పటి వరకు 85 శాతం షూట్ పూర్తి అయ్యింది అని అనుకున్న సమయానికి రిలీజ్ కావడం పక్కా అంటూ మేకర్స్ చెబుతున్నారు.

ఇక ఈ సినిమా కేజిఎఫ్ కు మించి ఎన్నో రెట్లు యాక్షన్ ఎలిమెంట్స్ తో పవర్ ఫుల్ గా నీల్ తెరకెక్కిస్తున్నాడు.మరి మిగిలిన షూట్ ఫాస్ట్ గా పూర్తి చేసి జులై లేదా ఆగష్టు నుండి వరుస అప్డేట్ లను ఇవ్వడానికి మేకర్స్ ప్లాన్ చేసుకుంటున్నారు.కాగా ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.

కెజిఎఫ్ సినిమాను నిర్మించిన హోంబలే వారు భారీ స్థాయిలో హాలీవుడ్ రేంజ్ లో సినిమాను నిర్మిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube