మరొకసారి ప్రపంచం ఆర్థిక మాంద్యం గుప్పిట చిక్కుకోనుందా?

ఇప్పటికే ఒకసారి ఆర్థిక మాంద్యం( Economic depression ) తాలూకు పరిస్థితులు అనుభవించిన ప్రపంచం మరొకసారి ఆ పరిణామాలు పునరావృతం అవుతాయనే అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి.అప్పటి పరిస్థితులకు కేంద్ర బిందువైన అమెరికా( America ) ఇప్పుడు మరొకసారి ఆర్థిక మాంద్యానికి రంగం సిద్ధం చేస్తుందని చెప్పాలి.

 Is The World Once Again In The Grip Of An Economic Depression , Economic Depress-TeluguStop.com

అప్పటి బ్యాంకుల ఫెయిల్యూర్ తో మొదలైన ఆర్థిక మాంద్యం పరిస్థితులు ప్రపంచ ఆర్దిక రంగాన్ని కుదేలు చేశాయని చెప్పాలి ఇప్పుడు అమెరికాలో మరో రెండు బ్యాంకులు ఫెయిలయ్యాయి. సిలికాన్ వాలీ బ్యాంక్, సిగ్నేచర్( Silicon Valley Bank, Signature ) బ్యాంకులు దివాళా తీసాయి.

ఇటీవల కాలం వరకు విజయవంతంగా నడిచిన ఈ బ్యాంకులు దివాలా తీయడానికి గల కారణాలను పరిశీలిస్తే.సిలికాన్ వాలీ బ్యాంక్ ఎక్కువగా సాఫ్ట్వేర్ కంపెనీలకు రుణాలు ఇస్తూ ఉంటుంది గత కొన్ని సంవత్సరాలుగా సాఫ్ట్వేర్ రంగం అభివృద్ధి చెందడంతో ఈ బ్యాంకు ఆస్తులు కూడా కొన్ని రెట్లు పెరిగాయి అయితే గత ఆరు నెలలుగా సాఫ్ట్వేర్ అభివృద్ధి మందగించింది దాని ప్రభావం ఈ బ్యాంక్ పై కూడా పడింది నగదు లభ్యత సరిపడనంత లేకపోవడంతో ఆస్తులు అమ్మి డిపాజిట్లు చేసిన వారికి నగదు చెల్లించడం మొదలుపెట్టింది ఈ విషయం బయటపడి ఆ బ్యాంకు తాలూకు షేర్ వాల్యూ 60 శాతానికి పడిపోయింది.

Telugu Economic, Federaldeposit, Signature, Siliconvalley-Latest News - Telugu

దానితో దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టిన ప్రభుత్వం తొందరపడి డిపాజిట్లు విత్ డ్రా చేయొద్దని ప్రజలను కోరింది అంతేకాకుండా బ్యాంక్ ఆస్తుల ను ఇతర ఆర్దిక సంస్థలకు అమ్మకానికి పెట్టింది .ప్రస్తుతం ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్( Federal Deposit Insurance Corporation ) సిలికాన్ వ్యాలీ బ్యాంక్ వ్యవహారాలను టేకోవర్ చేసింది.అయితే బ్యాంక్ లు దివాళా తియ్యడానికి మరొక వాదన వినిపిస్తుంది… ఈ రెండు బ్యాంకులు ప్రభుత్వ బాండ్లలో వడ్డ్డిరేట్లు తక్కువగా ఉన్నప్పుడు పెట్టుబడి పెట్టాయని ప్రభుత్వం ఆర్థిక మాంద్య పరిస్థితులను తట్టుకోవడానికి వడ్డీ రేటును పెంచాయని దాంతో ఈ రెండు బ్యాంకులు నష్టపోయాయని ఆర్థిక రంగం నిపుణులు విశ్వసిస్తున్నారు.ఏది ఏమైనా ప్రజలు బ్యాంకింగ్ వ్యవస్థ పై నమ్మకం కోల్పోతున్నారని జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అర్థమవుతుంది, ఈ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా బ్యాంకింగ్ షేర్లు పై పడే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి .అమెరికా ప్రభుత్వం ఏ ఒక్కరికి నష్టం కలగనివ్వనని భరోసా ఇస్తున్నప్పటికీ జరుగుతున్న వరుస పరిణామాలు ఆర్థిక మాంద్యంకి ఆరంభమని వాదనలు వినిపిస్తున్నాయి.ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube