Filmfare : నాకు ఇకపై ఎలాంటి అవార్డు ఇవ్వొద్దు అంటూ ఫిలిం ఫేర్ కి లేఖ రాసిన కమల్ హాసన్

భారతదేశంలో చాలా మంది నటీనటులు తాము నటించిన సినిమాలకు ఏదో ఒక రకమైన గుర్తింపుతో పాటు కలెక్షన్స్,అవార్డులు రావాలని ఖచ్చితంగా కోరుకుంటారు.ఇక చాలామంది భారతదేశ నటులకు ఇచ్చే అత్యుత్తమ పురస్కారాలు అయినా పద్మ అవార్డుల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రితో.

 Kamal Haasan Wrote A Letter To Film Fare-TeluguStop.com

మంత్రులతో, గవర్నర్ లతో, పైరవీలు కూడా చేస్తూ ఉంటారు.అంతా చేసిన కూడా అందులో ఎంత మందికి అవార్డు లభిస్తుంది చెప్పండి.

టాలెంట్ తో పాటు ఇలా కాస్త వెనకాల కథ నడిపించే వారికే అవార్డులు లభిస్తున్న రోజులు మరి.అయినా కూడా ఎవరైనా పిలిచి అవార్డు ఇస్తాను అంటే వద్దంటారా చెప్పండి.కానీ అలా వద్దు అని చెప్పి తనను ఎలాంటి అవార్డు పరిశీలన కూడా తీసుకోవద్దు అని చెప్పి ఫిలింఫేర్( Filmfare ) లాంటి ఒక సంస్థకి లేఖ రాసిన నటుడు ఎవరైనా ఉన్నారు అంటే అది కమల్ హాసన్ మాత్రమే.

Telugu Kamal Haasan, Kollywood, Letter, Oscar, Oscar Award, Swathi Muthyam-Lates

కమల్ హాసన్( kamal haasan ) కి అవార్డులు ఎన్ని వచ్చాయో కూడా లెక్క పెట్టుకోవడానికి సమయం ఉండదు.60 ఏళ్ల పాటు నటిస్తూనే ఉన్నాడు.చిన్నతనం నుంచి నేటి వరకు తాను ఎన్నో రకాలైన సినిమాలు చేస్తూ వచ్చాడు.

అయితే తనకు ఆస్కార్ లభించాలని కోరిక ఎప్పటి నుంచో ఉంది.అందుకోసం అలుపెరగని పోరాటమే చేశాడు.

ఏకంగా ఏడు సార్లు ఆస్కార్ అవార్డు( Oscar award ) గడప తొక్క పోయి బంగపడి తిరిగి వచ్చాడు.సాగర్ హిందీ, క్షత్రియ పుత్రుడు, ద్రోహి, భారతీయుడు, నాయకుడు, హే రామ్, స్వాతిముత్యం( Swathi Muthyam ) వంటి ఏడు సినిమాలకు ఆస్కార్ అవార్డు లభిస్తుందని ఎంతో ఆశగా ఎదురు చూశాడు కమలహాసన్.

ఇక ఆస్కార్ సంగతి పక్కన పెడితే ఫిలిం ఫెయిర్ కి తాను ఏ క్యాటగిరి లో కూడా పరిశీలనకు తీసుకోవద్దు అంటూ లేఖ రాయడం వెనక కారణం ఏమై ఉంటుందా అని చాలామంది ఆలోచించారు.

Telugu Kamal Haasan, Kollywood, Letter, Oscar, Oscar Award, Swathi Muthyam-Lates

వాస్తవానికి కమల్ హాసన్ వ్యక్తిత్వం చాలా భిన్నంగా ఉంటుంది.తనను ఎవరు గుర్తించాల్సిన పనిలేదు అని కమల్ హాసన్ అనుకుంటారు.అందుకే ఫిలిం ఫేర్ అవార్డులు ఇప్పటికే లెక్కలేనన్ని ఇంట్లో పెట్టుకున్నాడు కాబట్టి మరోసారి వెళ్లాలన్న ఇంట్రెస్ట్ లేకపోవడంతో అతడు ఏకంగా ఫిలింఫేర్ సంస్థకే లేఖ రాశాడు.

కొత్తవారికి అవకాశాలు ఇవ్వండి అంటూ తన లేఖలో పేర్కొనడం కూడా గమనించాల్సిన విషయం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube