తెలంగాణలో చాపకింద నీరులా మళ్లీ కరోనా వ్యాప్తి చెందుతోంది.నిన్న ఒక్కరోజు రాష్ట్రంలో 52 కేసులు నమోదు అయ్యాయని తెలుస్తోంది.
ఇందులో ఒక్క హైదరాబాద్ నగరంలోనే 30 కేసులు రావడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది.మరోవైపు హెచ్3ఎన్2 వైరల్ ఫీవర్స్ భయపెడుతున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో అప్రమత్తమైన వైద్యాధికారులు కరోనా నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై దృష్టి సారించారని సమాచారం.కరోనా, హెచ్3ఎన్2 వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.







