యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్,(Junior NTR) మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) సినీ కెరీర్ కు ఆర్.ఆర్.
ఆర్ సినిమా కెరీర్ పరంగా ప్లస్ అయింది.ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్ కు( Naatu Naatu Song) ఆస్కార్ రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా పేరు మరోమారు హాట్ టాపిక్ అవుతోంది.
అయితే నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ వచ్చినా ఇండస్ట్రీకి చెందిన కొందరు సినీ ప్రముఖులు మాత్రం ఈ సినిమా గురించి, ఈ అవార్డ్ గురించి స్పందించడం లేదు.

మరి కొందరు హీరోలు ఏదో మొక్కుబడిగా స్పందించి తాము కూడా స్పందించాం అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కొంతమంది మాత్రం ఈ అవార్డ్ విషయంలో రగిలిపోతున్నారని తమ సినిమాలకు రాకుండా ఆర్.ఆర్.ఆర్ కు ఆస్కార్ రావడంతో తెగ ఫీలవుతున్నారని సమాచారం అందుతోంది.కొంతమంది హీరోలు, దర్శకులలో ఇప్పటికైనా మార్పు వస్తుందని అనుకుంటే అత్యాశే అవుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

నాటు నాటు సాంగ్ తెలుగు రాష్ట్రాలకు గర్వ కారణం కాగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సైతం ఈ సాంగ్ క్రెడిట్ తమకు దక్కాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.నాటు నాటు సాంగ్ కు సంబంధించి ప్రేమ్ రక్షిత్ కు సైతం సరైన గౌరవం దక్కలేదని కొంతమంది అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఆర్.ఆర్.ఆర్ విడుదలై ఏడాది అవుతున్నా ఈ సినిమా గురించి చర్చ ఆగడం లేదు.

నాటు నాటు సాంగ్ ఈ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తుందని ఏడాది క్రితం ఎవరూ ఊహించలేదు.ఈ సినిమా తెలుగు సినిమాల స్థాయిని ఊహించని విధంగా పెంచిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.నాటు నాటు సాంగ్ రాబోయే రోజుల్లో మరిన్ని సంచలనాలు సృష్టించి మరిన్నిఅవార్డులను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
నాటు నాటు సాంగ్ కు వ్యూస్ అంతకంతకూ పెరుగుతున్నాయి.







