మామూలుగా సెలబ్రెటీలు ఫోటో షూట్ లు చేయించుకోవడానికి బాగా ఇష్టపడుతూ ఉంటారు.ఏదైనా మంచి ఔట్ ఫిట్ వేసుకుంటే చాలు వెంటనే మంచి బ్యాక్ గ్రౌండ్ చూసి ఫోటోలు దిగుతుంటారు.
ముఖ్యంగా హీరోయిన్లు మాత్రం బాగా ఫోటోషూట్లంటూ హడావిడి చేస్తూ ఉంటారు.ఈమధ్య కొందరు హీరోలు కూడా ఫోటో షూట్ లు చేయించుకుంటూ బాగా రచ్చ చేస్తున్నారు.
మంచి మంచి షూట్ వేసుకొని ఫోటోలు దిగుతూ ఉంటారు.అయితే కొన్ని కొన్ని సార్లు ట్రెండ్ అనుకొని కొన్ని చోట్ల ఫోటోలు దిగి ట్రోల్స్ కు గురవుతూ ఉంటారు.
ఇప్పుడు అటువంటి ట్రోలే ఎదుర్కొన్నాడు హీరో నాని.ఇంతకూ అసలేం జరిగిందో తెలుసుకుందాం.
టాలీవుడ్ లో నాచురల్ స్టార్ గా గుర్తింపు పొందిన నాని(Nani) గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఈయనకు తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి అభిమానం ఉంది.
నాని హీరోగా అడుగు పెట్టకముందు క్లాప్ అసిస్టెంట్ గా పని చేశాడు.ఆ తర్వాత నటుడుగా పరిచయమయ్యాడు.
ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటాడు హీరో నాని.నాని తొలిసారిగా అష్టా చమ్మా సినిమాతో(Astachamma) పరిచయమయ్యాడు.
ఈ సినిమాలో హీరోగా నటించిన నాని తన తొలి నటనకే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఆ తర్వాత వరుస సినిమాలలో అవకాశాలు అందుకొని మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇక ఇండస్ట్రీకి చాలా మంది హీరోలు బ్యాక్ గ్రౌండ్ లేకుండా అడుగు పెట్టగా అందులో నాని కూడా ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే అడుగు పెట్టాడు.ఇక నాని ఎంచుకునే కథలు కూడా చాలా డీసెంట్ గా అనిపిస్తుంటాయి.కేవలం క్లాస్ హీరో గానే కాకుండా మాస్ హీరోగా కూడా నాని అదరగొడతాడు అని చెప్పాలి.హీరో గానే కాకుండా నిర్మాతగా కూడా బాధ్యతలు చేపట్టాడు నాని.
నిర్మాతగా పలు సినిమాలలో చేయగా నిర్మాత కూడా బాగా కలిసి వచ్చింది.ఇక ప్రస్తుతం ఈయన దసరా (Dasara movie) అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.
ఈయన సరసన మహానటి కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తుంది.

ఇక ఈ సినిమాలో నాని మాస్ లుక్కుల్లో కనిపిస్తున్న సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమాపై భారీ అంచనాలు కూడా వెలువడ్డాయి.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బిజీలో ఉంది.
ఇక ఇదంతా పక్కన పెడితే నాని సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు ఇంట్రెస్టింగ్ పోస్టులు షేర్ చేస్తూ ఉంటాడు.ఈమధ్య బాగా ఫోటో షూట్ లు కూడా చేయించుకుంటున్నాడు నాని.
మంచి మంచి లుక్స్ తో అమ్మాయిలను ఫిదా చేస్తున్నారు.ఇదంతా పక్కన పెడితే తాజాగా మరికొన్ని ఫోటో షూట్ లు చేయించుకున్నాడు.

అందులో మంచి డ్రెస్ తో హ్యాండ్సమ్ గా కనిపించాడు.కానీ ఆ ఫోటోలు చూసి నెటిజన్స్ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.కారణం ఏంటంటే ఆయన బాత్ టబ్బులో ఫోటోలు దిగాడు.పైగా అందులో పడుకొని ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు.దీంతో ఆ ఫోటోలు చూసి ప్రతి ఒక్కరు కామెంట్లు చేస్తున్నారు.ఏంటి నాని బాత్రూంలో ఈ ఫోజులు ఏంటి అంటూ సెటైర్లు వేస్తున్నారు.
నీకు మరో ప్లేస్ దొరకలేదా అంటూ కామెంట్లు చేస్తున్నారు.ప్రస్తుతం ఆ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి.







