జయం (Jayam movie) సినిమాతో హీరో గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నితిన్…(Nithin) ఈయన తీసిన ఆ సినిమా సూపర్ సక్సెస్ కొట్టడంతో ఆ తరువాత ఆయన వరుసగా కొన్ని సినిమాలు చేశారు అందులో వినాయక్ తో చేసిన దిల్ సినిమా(Dil movie) ఒకటి అయితే ఈ సినిమా ని వినాయక్ ముందుగా ఆనందం లాంటి సినిమాతో హీరో గా పరిచయం అయి మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్న ఆకాష్ (Akash) ని పెట్టీ తీయాలి అనుకున్నాడు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది కుదరలేదు ఒకవేళ వినాయక్ ఈ సినిమాని ఆకాష్ తో కనక తీసి ఉంటే ఆకాష్ కెరియర్ లో ఇదొక సూపర్ హిట్ సినిమా గా మిగిలి ఉండేది…

ఈ సినిమాతో నితిన్ స్టార్ హీరో అయ్యాడు ఇక ఆకాష్ విషయానికి వస్తే ఆయన చేసిన సినిమాలు ఏది కూడా హిట్ అవ్వకపోవడం తో కొన్ని సినిమాల్లో గెస్ట్ రోల్స్ కూడా చేశాడు ఇక ఆ తరువాత చాలా రోజుల పాటు ఖాళీ గా ఉన్నాడు ఇక ఇప్పుడు కొన్ని సీరియల్స్ లో కూడా నటించబోతున్నారు అంటూ అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి ప్రస్తుతం ఆయన తమిళ్ సీరియల్స్ లో నటిస్తున్నట్లు తెలుస్తుంది…

అలా హీరోలు వాళ్ల కెరియర్ లో మంచి సినిమా ఒక్కటి మిస్ అయిన కూడా చాలా రోజుల పాటు బాధపడాల్సి వస్తుంది.అందుకే సినిమాలు చేయడం ఇంపార్టెంట్ కాదు మంచి సినిమా చేయడం అనేది ఒక్కటే ఇక్కడ ఇంపార్టెంట్… ఆకాష్ కి నిజంగా దిల్ లాంటి సినిమా పడితే మనోడి కెరియర్ సూపర్ గా సాగేది…అందుకే ఒక సినిమా చెయ్యాలా వద్ద అనే డిసిజన్ మీదే హీరోల కెరియర్ ఆధారపడి ఉంటుంది అని చెప్పడానికి ఆకాష్ కెరియర్ ఒక ఉదాహరణ…








