తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.ఏపీలో మూడు గ్రాడ్యుయేట్, 2 టీచర్స్, 4 స్థానిక సంస్థలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి.
మొత్తం 1538 పోలింగ్ స్టేషన్లలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి.శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ గ్రాడ్యుయేట్ స్థానానికి మొత్తం 37 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
కడప -అనంతపురం ఉపాధ్యాయ బరిలో 12 మంది అభ్యర్థులుండగా.ప్రకాశం -నెల్లూరు -చిత్తూరు గ్రాడ్యుయేట్ స్థానానికి 22 మంది అభ్యర్థులు పోటీపడ్డారు.
ఇటు తెలంగాణలోని హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికకు పోలింగ్ ముగిసింది.కాగా ఈనెల 16న ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది.







