సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘SSMB28’.ఎప్పటికప్పుడు డిలే అవుతూ వస్తున్న షూట్ ను సంక్రాంతి తర్వాత ఎట్టకేలకు షూట్ స్టార్ట్ అయ్యింది.
మహేష్ కూడా ఈ గ్యాప్ ను పూర్తి చేయాలని గ్యాప్ లేకుండా షూటింగ్ చేస్తూ కష్ట పడుతున్నాడు.దాదాపు 11 ఏళ్ల తర్వాత మహేష్-త్రివిక్రమ్ కాంబో రిపీట్ కాబోతుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
పాన్ ఇండియన్ రేంజ్ లో రిలీజ్ కానున్న ఈ సినిమా ఆగస్టు 11న రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.మరి ఈ డేట్ కు మరి కొంతమంది క్యూ కట్టేందుకు సిద్ధం అవుతున్నారు అని తాజాగా సమాచారం అందుతుంది.
మాములుగా అయితే ముందుగా మహేష్ బాబునే ఈ డేట్ ను లాక్ చేసుకున్నాడు.అయితే ఇప్పుడు ఈ డేట్ కు మరికొంత మంది వచ్చే అవకాశం కనిపిస్తుంది.

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్(Bhola Shankar ) సినిమా ముందుగా సమ్మర్ కు రిలీజ్ అవుతుంది అని అంతా అనుకున్నారు.అయితే షూట్ ఆలస్యం కావడంతో ఈ సినిమా సమ్మర్ కానుకగా కాకుండా ఆగస్టు 11న రావాలని అనుకుంటుందట.మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ చెల్లి పాత్రలో నటిస్తుండగా.తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది.

మరి మహేష్ టీమ్ కాస్త ఆలస్యంగా అయినా దసరాకు వద్దాం అనుకుంటే దసరాకు వినోదయ సీతం రీమేక తో పవన్(Pawan Kalyan), అలాగే బాలకృష-అనిల్ రావిపూడి కాంబోలో రాబోతున్న సినిమాలు కూడా రావడానికి సిద్ధం అవుతున్నాయి.ఒకవేళ మహేష్ సోలోగా రావాలంటే దీపావళికి రావాలని ఇది తప్పితే క్రిస్మస్, సంక్రాంతికి పోటీ తప్పదని అంటున్నారు.చూడాలి దీపావళికి మహేష్ వస్తాడో లేకపోతే పోటీ లోనే బరిలోకి దిగుతాడా వేచి చూడాలి.







