ఇంటర్ పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు.ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులతో పాటు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 9,47,699 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్న సంగతి తెలిసిందే.అయితే పరీక్షల సమయంలో విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి గురి కావొద్దని మంత్రి సబిత సూచించారు.
ప్రైవేట్ కాలేజీలు హాల్ టికెట్స్ ఇవ్వడం లేదని తమకు కొన్ని ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు.ఈ మేరకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించారు.







