సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ ను అభిమానించే సెలబ్రిటీల జాబితా ఎక్కువగానే ఉంది.ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న రోలర్ రఘు ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్య్వూలో మాట్లాడుతూ తారక్ గురించి గొప్పగా కామెంట్లు చేశారు.
ప్రతి హీరోతో నాకు మంచి రిలేషన్ ఉందని ఆ హీరోలు ఎంతగానో ప్రోత్సహించారని రోలర్ రఘు(Raghu) అన్నారు.నేను ఎవరితో పని చేసినా రెండో సినిమాలో ఛాన్స్ ఉంటుందని ఆయన తెలిపారు.
సెట్ లో హీరో అంటే హీరో అని నా స్టేజ్ లో నేను ఉంటా అని రోలర్ రఘు కామెంట్లు చేశారు.హీరో అంటే మనకో రెస్పెక్ట్ అని ఆ రెస్పెక్ట్ నేను ఇస్తానని ఆయన వెల్లడించారు.
జూనియర్ ఎన్టీఆర్ స్పేస్ ఇవ్వడం వల్లే ఆయనకు అంత క్లోజ్ అయ్యానని అది ఆయన గొప్పదనమని రోలర్ రఘు అన్నారు.పవన్ తో మాత్రం ఇప్పటివరకు చేయలేదని ఆయన కామెంట్లు చేశారు.
గబ్బర్ సింగ్ లో ఛాన్స్ వచ్చిందని కానీ వేరే సినిమాకు డేట్స్ ఇవ్వడంతో వదులుకున్నానని రోలర్ రఘు తెలిపారు.

సర్దార్ గబ్బర్ సింగ్ (Sardaar Gabbar Singh)లో కూడా కొన్ని కారణాల వల్ల నటించలేదని ఆయన కామెంట్లు చేశారు.ఇచ్చిన మాటపై నేను నిలబడతానని రోలర్ రఘు పేర్కొన్నారు.ఒకప్పుడు తాను సాఫ్ట్ వేర్ జాబ్ చేశానని జూనియర్ ఎన్టీఆర్ కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా తీయడానికైనా సిద్ధమని రోలర్ రఘు పేర్కొన్నారు.
ఎవరైనా జూనియర్ ఎన్టీఆర్(JR NTR) గురించి తప్పుగా అంటే ప్రాణం మిగలదని తారక్ అంటే అంత ఇష్టం అని రోలర్ రఘు తెలిపారు.

తాతకు తగ్గ మనవడు ఎన్టీఆర్ అని ఎన్టీఆర్ కచ్చితంగా సీఎం అవుతారని ఆయన కామెంట్లు చేశారు.జూనియర్ ఎన్టీఆర్ నా బాడీలో పార్ట్ లా మారిపోయారని రోలర్ రఘు చెప్పుకొచ్చారు.రోలర్ రఘు వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.







