తమిళ ఇండస్ట్రీలో హీరోగా మంచి గుర్తింపు పొందిన జయం రవి , తెలుగులో కూడా కొన్ని సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందాడు.ముఖ్యంగా తెలుగులో విడుదలైన బొమ్మరిల్లు నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి సినిమాలను తమిళ్లో చేసి నటించిన సినిమాలు బాగా పాపులర్ అయ్యాడు.
తెలుగులో కూడా ఎన్నో సినిమాలలో కీలక పాత్రలలో నటించి ఇక్కడి ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నాడు.అలాగే తమిళ్ భాషలో ఆయన నటించిన సినిమాలు తెలుగులో కూడా డబ్ చేసి విడుదల చేశారు.

ఇక తాజాగా సీనియర్ డైరెక్టర్ మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘పొన్నియన్ సెల్వన్ ‘ సినిమాలో విక్రమ్, కార్తీతో పాటు జయం రవి కూడా కీలకపాత్రలో నటించాడు.ఇలా హీరోగా తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలలో గుర్తింపు పొందిన జయం రవి పర్సనల్ లైఫ్ గురించి చాలామందికి తెలియదు.తాజాగా జయం రవి ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ప్రముఖ తమిళ డైరెక్టర్ మోహన రాజా స్వయానా జయం రవికి సోదరుడు.ఇటీవల చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమాకు మోహన రాజా దర్శకత్వం వహించాడు.

ఇక జయం రవి ఫ్యామిలీ విషయానికి వస్తే భార్య, అరవ్, అయాన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.ఇప్పటివరకు జయం రవి భార్య పిల్లలు బయట చాలా అరుదుగా కనిపించారు.

తాజాగా జయం రవి కుటుంబానికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ ఫోటోలో జయం రవి తన భార్య ఇద్దరు కుమారులతో కలిసి ట్రెడిషనల్ దుస్తులు ధరించి ఉన్నారు.ఈ ఫోటోలో వీరి కుటుంబం ఎంతో చూడముచ్చటగా కనిపిస్తోంది.
ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో క్యూట్ ఫ్యామిలీ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.







