అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) మరో ఇద్దరు భారతీయ అమెరికన్లకు కీలక పదవులు కట్టబెట్టారు.రేవతి అద్వైతి (ఫ్లెక్స్ సీఈవో), మనీష్ బాప్నా (నేచురల్ రిసోర్సెస్ డిఫెన్స్ కౌన్సిల్ సీఈవో)లను ట్రేడ్ పాలసీ అండ్ నెగోషియేషన్స్ అడ్వైజరీ కమిటీకి ఎంపిక చేశారు.
యూఎస్ ట్రేడ్ పాలసీకి సంబంధించి డెవలప్‌మెంట్, ఇంప్లిమెంటేషన్, అడ్మినిస్ట్రేషన్ తదితర విషయాలపై యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్‌కు విధాన సలహాలను అందించే అడ్వైజరీ కమిటీకి 14 మంది వ్యక్తులను నియమిస్తున్నట్లు శుక్రవారం జో బైడెన్ ఓ ప్రకటనలో తెలిపారు.వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునే ముందు లక్ష్యాలు, బేరసారాలు, చర్చలు, వాణిజ్య ఒప్పందాల అమలు ప్రభావం, పరిపాలనకు సంబంధించి ఉత్పన్నమయ్యే ఇతర అంశాలపై వీరు సలహాలు ఇస్తారు.
ఫ్లెక్స్ సీఈవోగా(Flex ceo) వ్యవహరిస్తున్న రేవతి అద్వైతి(Revathi Advaithi).2019 నుంచి ఈ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.ఫ్లెక్స్‌లో చేరడానికి ముందు ఈటన్‌లో ఎలక్ట్రికల్ సెక్టార్ బిజినెస్‌కు ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా వ్యవహరించారు.ఇది 20 బిలియన్ డాలర్లకు పైగా అమ్మకాలు.1,02,000 మంది ఉద్యోగులను కలిగి వుంది.అలాగే అమెరికాస్, హనీవెల్, ఉబెర్, కేటాలిస్ట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లోనూ రేవతి పనిచేశారు.
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్లూఈఎఫ్) అడ్వాన్స్‌డ్ మాన్యు ఫ్యాక్చరింగ్ సీఈవో కమ్యూనిటీకి కో చైర్‌గా, సీఈవో క్లైమేట్ లీడర్స్ అలయన్స్‌లోనూ రేవతి కీలక బాధ్యతలు నిర్వర్తించారు.వరుసగా నాలుగేళ్ల పాటు ఫార్చ్యూన్ మోస్ట్ పవర్‌ఫుల్ బిజినెస్ వుమెన్‌గా నిలిచారు.అలాగే భారతదేశానికి చెందిన మోస్ట్ పవర్‌ఫుల్ వుమెన్‌లలో ఒకరిగా బిజినెస్ టుడ్ గుర్తింపునిచ్చింది. బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని, థండర్‌బర్డ్ స్కూల్ ఆఫ్ గ్లోబల్ మేనేజ్‌మెంట్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు.
మనీష్ బాప్నా(Manish Bapna) విషయానికి వస్తే.నేచురల్ రిసోర్సెస్ డిఫెన్స్ కౌన్సిల్ (ఎన్‌ఆర్‌డీసీ) ప్రెసిడెంట్ అండ్ సీఈవోగా వ్యవహరిస్తున్నారు.గతంలో వరల్డ్ రిసోర్సెస్ ఇన్‌స్టిట్యూట్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా మనీష్ పనిచేశారు.హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి బిజినెస్ అండ్ పొలిటికల్ అండ్ ఎకనమిక్ డెవలప్‌మెంట్‌లో మాస్టర్స్ డిగ్రీ, ఎంఐటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందినట్లు వైట్‌హౌస్ తెలిపింది.