క్రికెట్ అభిమానులకు శుభవార్త.ఐపీఎల్ 23కి(IPL 2023) సర్వత్రా సిద్ధమైపోయినట్టే.
ఈ సందర్భంగా ఇంతకు మునుపు IPL చరిత్రలో పరుగుల వరద పారించిన వారు ఓ 11 మంది వున్నారు.ఇపుడు వారిపైన ఈ కధనం.
బ్యాటింగ్ ఆర్డర్ ఒకసారి పరిశీలిస్తే, ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు వీరు నమోదు చేయడం విశేషం.అయితే, వీరిలో 5 స్థానాల్లో బరిలోకి దిగి అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లదే పైచేయి కావడం గమనార్హం.
ఇలా లిస్టు పరిశీలిస్తే, నంబర్ 1, నంబర్ 2 స్థానాల్లో డేవిడ్ వార్నర్, శిఖర్ ధావన్ ఇప్పటికే కొనసాగుతున్నారు.వారి పరుగుల సంఖ్య చూస్తే దిమ్మ తిరగాల్సిందే.ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా 3864 పరుగులు చేసి డేవిడ్ వార్నర్(David Warner) నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు.అలాగే 4852 పరుగులు చేసిన శిఖర్ ధావన్(Shikhar Dhawan) 2వ నంబర్ కైవసం చేసుకున్నాడు.
అదేవిధంగా ఇక మూడో స్థానంలో బ్యాటింగ్కు దిగి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సురేష్ రైనా రికార్డు సాధించాడు.అయితే ఈ ఐపీఎల్ 2023లో రైనా ఆడకపోవడం ఒకింత బాధాకరం.
దాంతో ఇతగాడు తన స్థానాన్ని కాస్త కోల్పోయి కింది స్థాయి నెంబర్లకు పడిపోవడం ఖాయం.
ఇక రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీ 4, 5 బ్యాటింగ్ స్థానాల్లో కొనసాగుతూ వరుసగా 2392, 1949 పరుగులు చేయడం విశేషంగా చెప్పుకోవచ్చు.అదే విధంగా లోయర్ ఆర్డర్లో వెస్టిండీస్ ఆటగాళ్లు 6, 7 స్థానాల్లో కొనసాగుతుందండం విశేషం.వారి పేర్లు కీరన్, ఆండ్రీ రస్సెల్.
వీరు వరుసగా 1372, 718 పరుగులతో కొనసాగుతున్నారు.ఇక చివరగా 8, 9, 10, 11 స్థానాలతో మన భారత ఆటగాళ్లు సరిపెట్టుకున్నారు.
వీరిలో హర్భజన్ సింగ్ 406 పరుగులు, భువనేశ్వర్ కుమార్ 167, ప్రవీణ్ కుమార్ 86, మునాఫ్ పటేల్ 30 పరుగులతో ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసి లిస్టులో వున్నారు.