‘పార్ట్ టైం పొలిటిషన్’ జనశెన అధినేత పవన్ కళ్యాణ్ పై అత్యధికంగా వినిపించే విమర్శ ఇది.ఆయన తన సినిమా షెడ్యూల్ గ్యాప్లో పాలిటిక్స్ చేస్తారని రాజకీయం కూడా ఆయనకు సినిమాలాగే ఉంటుందని ప్రజా జీవితం మీద ఆయనకు సిన్సియారిటీ లేదని ఆయన రాజకీయ ప్రత్యర్థులు తరచూ విమర్శిస్తుంటారు.
అయితే మిగతా రాజకీయ నాయకుల్లాగా తమ అధినేతకు ఫ్యాక్టరీలు వ్యాపారాలు లేవని సినిమా ఒకటే ఆయన ఆదాయ మార్గమని ఆయన నిజాయితీగా సంపాదించిన కోట్లాది రూపాయలని ప్రజల కోసం ఖర్చు పెడుతున్న మనసున్న మనిషి అని అలాంటి నేతను మరొకరిని చూపించండి అంటూ జన సైనికులు కూడా అదే విధంగా రిటార్ట్ ఇస్తూ ఉంటారు.అయితే రాజకీయాలు పక్కన పెట్టి చూస్తే వరస సినిమాల వల్ల ఆయన ఈమధ్య రాజకీయంగా ప్రజలకు కొంత దూరం అయ్యారనే చెప్పొచ్చు .అయితే ఇకపై ఆయన వరుస కార్యక్రమాలతో ప్రజా జీవితంలో బిజీ బిజీగా మారనున్నారు.

రేపటి నుంచి మొదలుపెట్టి రకరకాల సంఘాల నేతలతో మీటింగ్లు ,పార్టీ కీలక నేతలతో వరుస సమావేశాలు తోపాటు ఇటీవల గవర్నర్గా ఎన్నికైన మాజీ న్యాయమూర్తి అబ్దుల్ నజీర్ గారిని మర్యాదపూర్వకంగా కలవనున్నారు.ఆ తర్వాత మచిలీపట్నంలో పార్టీ ఆవిర్భావ సభ లో పాల్గొంటారు .మొదట చిన్న సభ లా ప్లాన్ చేసినప్పటికీ ఇప్పడు వంద ఎకరాలకు విస్తరించి బారీస్థాయిలో సభ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు .ఆపై వారాహిలో ప్రజా యాత్రలు ఇలా వరుస పెట్టి షెడ్యూల్ ప్రకటిస్తూ జనసేనాని పొలిటికల్ గా టాప్ గేర్ మార్చారని తెలుస్తుంది.ఇకపై వరుసగా కమిటీల నియామకాలు కూడా చేపట్టి పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలపరుచుకోనున్నారని తెలుస్తుంది అసంఖ్యాకమైన అభిమాన బలం ఉన్నప్పటికీ కూడా వాటిని ఓట్ల రూపంలో మార్చుకోవడంలో దారుణ దారుణంగా విఫలమైన సంగతి తెలిసింది సంస్థాగతంగా బలమైన నిర్మాణం లేకపోవడం వల్లే ఆ ఓట్ల ట్రాన్స్ఫర్ అన్నది సరిగ్గా జరగలేదని ఈసారి ఆ తప్పు జరగకూడదని సరైన వ్యూహాలతో ఎప్పటికప్పుడు లోటుపాట్లను సరి చేసుకుంటూ పార్టీ ప్రాబల్యాన్ని పెంచుకుంటూ అధికారం దిశగా పావులు కదపాలని జనసేనాని ఆలోచిస్తున్నారని పార్టీ వర్గాల కథనం.
ఏది ఏమైనా వేగం పెంచిన పవన్ కళ్యాణ్ చర్యలతో రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నికల వేడి మొదలవుతుందనివ్యూహ ప్రతి వ్యూహాలతో ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ హీట్ కూడా పెరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.







