సాధారణంగా ఏదో ఒక ప్రత్యేకత ఉంటేగాని వీడియోలు అనేవి సోషల్ మీడియాలో వైరల్ కావు.అయితే కొన్ని సార్లు ఏ విషయం లేకుండా వున్నా ఫేమస్ అయిపోతూ ఉంటాయి.
అది అప్రస్తుతం గాని, వైరల్ అయిన వీడియోలు చాలా అరుదుగా నెటిజన్ల మనసులను దోచుకుంటూ ఉంటాయి.తాజాగా అలాంటి వీడియో ఒకటి మనోళ్ళకి బాగా నచ్చేసింది.
అది ప్రేమకు ప్రతిరూపంలాగా నిలుస్తోంది.ఈ రోజుల్లో స్వచ్ఛమైన ప్రేమ(Pure Love) చాలా అరుదనే చెప్పుకొని తీరాలి.
ఎక్కడ చూసినా ఒత్తిడి, డబ్బు సంపాదించాలనే ఆరాటం, విలాసవంతమైన జీవితం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడే వ్యక్తులే మన చుట్టూ కనిపిస్తారు.

ఈ క్రమంలోనే చాలా మంది మూడుముళ్ల బంధాన్ని మూన్నాళ్ళ ముచ్చటే అనుకుంటున్నారు.పెళ్ళై కనీసం ఆరునెలలు కాకుండానే జంటలు విడిపోతున్నాయి.అవును, ఈ రోజుల్లో ఎక్కువగా ప్రేమ వివాహాలు చేసుకున్నవారు ఎక్కువగా విడిపోవడం మనం చూస్తూ వున్నాం.
ప్రేమించి, పెళ్లి చేసుకున్నాం అని గొప్పగా చెప్పుకొనే జంటలు కూడా ఎక్కువ కాలం కలిసి ఉండలేని పరిస్థితులు ఉండడం మనం కళ్లారా చూసాము.అందుకే మన పెద్దవాళ్ళు ఈ ప్రేమ వివాహాల పట్ల విముఖత చూపించరు.

ఇక అసలు విషయానికొస్తే, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోని చూస్తే, ఓ హోటల్‌లో అందమైన వృద్ధ జంట(Old Couple) బీరు తాగుతున్న దృశ్యాలు మనకు స్పష్టంగా కనబడతాయి.కాగా ఈ వీడియోకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున స్పందన రావడం ఇక్కడ చూడవచ్చు.ది ప్రివీ పిక్చర్స్ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక అందమైన ప్రేమజంటకు సంబంధించిన వీడియో షేర్ చేయబడింది.ముంబైలోని ఓ రెస్టారెంట్‌లో తీసిన వీడియోగా అనిపిస్తుంది.ఈ వీడియోలో ఇద్దరూ చేతిలో బీరు(Beer) పట్టుకుని ఉత్సాహంగా సిప్ చేస్తున్నారు.వీడియో క్రింద నిజమైన ప్రేమ అని క్యాప్షన్‌లో రాసి ఉంది.
ఈ వీడియోని ఇప్పటి వరకు 9 మిలియన్లకు పైగా ప్రజలు వీక్షించడం కొసమెరుపు.







