ప్రేమ చివరి రోజుల్లోనే కనబడుతుంది… ఇక్కడ చిల్ అవుతోన్న వృద్ధ దంపతులని చూస్తేనే తెలిసిపోతుంది!
TeluguStop.com
సాధారణంగా ఏదో ఒక ప్రత్యేకత ఉంటేగాని వీడియోలు అనేవి సోషల్ మీడియాలో వైరల్ కావు.
అయితే కొన్ని సార్లు ఏ విషయం లేకుండా వున్నా ఫేమస్ అయిపోతూ ఉంటాయి.
అది అప్రస్తుతం గాని, వైరల్ అయిన వీడియోలు చాలా అరుదుగా నెటిజన్ల మనసులను దోచుకుంటూ ఉంటాయి.
తాజాగా అలాంటి వీడియో ఒకటి మనోళ్ళకి బాగా నచ్చేసింది.అది ప్రేమకు ప్రతిరూపంలాగా నిలుస్తోంది.
ఈ రోజుల్లో స్వచ్ఛమైన ప్రేమ(Pure Love) చాలా అరుదనే చెప్పుకొని తీరాలి.ఎక్కడ చూసినా ఒత్తిడి, డబ్బు సంపాదించాలనే ఆరాటం, విలాసవంతమైన జీవితం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడే వ్యక్తులే మన చుట్టూ కనిపిస్తారు.
"""/" /
ఈ క్రమంలోనే చాలా మంది మూడుముళ్ల బంధాన్ని మూన్నాళ్ళ ముచ్చటే అనుకుంటున్నారు.
పెళ్ళై కనీసం ఆరునెలలు కాకుండానే జంటలు విడిపోతున్నాయి.అవును, ఈ రోజుల్లో ఎక్కువగా ప్రేమ వివాహాలు చేసుకున్నవారు ఎక్కువగా విడిపోవడం మనం చూస్తూ వున్నాం.
ప్రేమించి, పెళ్లి చేసుకున్నాం అని గొప్పగా చెప్పుకొనే జంటలు కూడా ఎక్కువ కాలం కలిసి ఉండలేని పరిస్థితులు ఉండడం మనం కళ్లారా చూసాము.
అందుకే మన పెద్దవాళ్ళు ఈ ప్రేమ వివాహాల పట్ల విముఖత చూపించరు. """/" /
ఇక అసలు విషయానికొస్తే, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోని చూస్తే, ఓ హోటల్‌లో అందమైన వృద్ధ జంట(Old Couple) బీరు తాగుతున్న దృశ్యాలు మనకు స్పష్టంగా కనబడతాయి.
కాగా ఈ వీడియోకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున స్పందన రావడం ఇక్కడ చూడవచ్చు.
ది ప్రివీ పిక్చర్స్ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక అందమైన ప్రేమజంటకు సంబంధించిన వీడియో షేర్ చేయబడింది.
ముంబైలోని ఓ రెస్టారెంట్‌లో తీసిన వీడియోగా అనిపిస్తుంది.ఈ వీడియోలో ఇద్దరూ చేతిలో బీరు(Beer) పట్టుకుని ఉత్సాహంగా సిప్ చేస్తున్నారు.
వీడియో క్రింద నిజమైన ప్రేమ అని క్యాప్షన్‌లో రాసి ఉంది.ఈ వీడియోని ఇప్పటి వరకు 9 మిలియన్లకు పైగా ప్రజలు వీక్షించడం కొసమెరుపు.