సాధారణంగా సినిమా సెలబ్రిటీలు అంటేనే వారిపై మీడియా ఫోటోగ్రాఫర్స్ ఫోకస్ భారీగానే ఉంటుంది.వారి ప్రతి ఒక్క కదిలికలను గమనిస్తూ తమ కెమెరాలలో బంధిస్తూ ఉంటారు.
ఇలా సెలబ్రిటీలు ఒక్క అడుగు ముందుకు వేసిన కెమెరాలు వారి చుట్టూ చేరి ఊపిరాడనివ్వకుండా చేస్తుంటారు.ఇలా కొన్నిసార్లు ఫోటోగ్రాఫర్ల తీరు పట్ల ఎంతోమంది సెలబ్రిటీలు విసుకు చెంది ఫోటోగ్రాఫర్లపై అసహనం వ్యక్తం చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి.
గత కొద్ది రోజుల క్రితం అలియా భట్ ఇంట్లో ఉండగా ఎదురుగా ఉన్న బిల్డింగ్ నుంచి కెమెరాలు తనపై ఫోకస్ చేశాయి అంటూ ఈమె తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

ఇక సైఫ్ అలీ ఖాన్ దంపతులు ఏదో కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా ఫోటోగ్రాఫర్లు తనని చుట్టుముట్టడంతో ఫోటోగ్రాఫర్ల తీరుపై మండిపడిన సైఫ్ రండి మా బెడ్ రూమ్ లోకి వచ్చి ఫోటోలు తీయండి అంటూ వారికి చాలా కూల్ గా చురకలు అంటించారు.ఇలా ఎప్పటికప్పుడు సెలబ్రిటీలు ఫోటోగ్రాఫర్లపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.అయితే తాజాగా రణబీర్ కపూర్ ఈ విషయం గురించి మాట్లాడుతూ చట్టపరమైన చర్యలకు కూడా వెళ్లడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ మరోసారి ఫోటోగ్రాఫర్లకు వార్నింగ్ ఇచ్చారు.

మేము కూడా అందరిలాగే మనుషులమే సెలబ్రిటీలు అయినంత మాత్రాన మాకంటూ పర్సనల్ లైఫ్ ఉండదా? మీలాగే మాకు పర్సనల్ లైఫ్ ఉంటుంది మా పర్సనల్ లైఫ్ లోకి కూడా మీరు కెమెరాలు పెట్టి చూడటం భావ్యం కాదు.అసలు మా ఇంట్లోకి కెమెరాలు పెట్టి సీక్రెట్ గా మమ్మల్ని ఫోకస్ చేయడం ఏంటి? అసలు ఇది తలుచుకుంటేనే చాలా చిరాగ్గా ఉందని అసహ్యం వేస్తుందని రణబీర్ కపూర్ మండిపడ్డారు.సెలబ్రిటీలుగా మేము మీరు అంతా కలిసి పని చేయాల్సి ఉంటుంది అలాంటప్పుడు ఒకరికొకరు గౌరవించుకోవడ ఇంకోసారి ఇలా కనుక రిపీట్ అవుతే తాను చట్టపరంగా ముందుకు వెళ్తానని ఈ సందర్భంగా రణబీర్ కపూర్ దంపతులు మరోసారి ఫోటోగ్రాఫర్ల వ్యవహార శైలి పై మండిపడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.







