డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఒకటి ప్రధాని మరొకటి అదాని; కవిత సంచలన వ్యాఖ్యలు

కేంద్ర ప్రభుత్వంపై కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు మోడీ వచ్చే ముందు ఈడీ వస్తుందంటూ పంచ్ డైలాగులు పేల్చారు.ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ .

 A Double Engine Government Means One Is The Prime Minister And The Other Is Adan-TeluguStop.com

సోనియా చొరవతో యూపీఏ హయాంలో మహిళా బిల్లు రాజ్యసభలో పాస్ అయిందని, సంకీర్ణ ప్రభుత్వం అయినందున లోక్ సభ ఆ బిల్లు పాస్ కాలేదని, మరి స్త్రీకి అత్యంత ప్రాధాన్యమిస్తామని ప్రగల్బాలు పలుకుతూ తల్లి ఫోటో పెట్టుకుని రాజకీయాలు చేసే భాజపా అధిష్టానం రెండుసార్లు సొంతంగా అధికారంలోకి వచ్చినా కూడా ఈ బిల్లుపై ఉలుకు పలుకు లేకుండా ఉందని, మహిళల పట్ల భాజపా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో ఇక్కడే అర్థమవుతుందని ఆరోపించారు .కనీసం ఇరుగుపొరుగు దేశాలలో స్త్రీలకు లభిస్తున్న స్థాయిలో కూడా ఇక్కడ స్త్రీలకు ప్రాతినిధ్యం దక్కడం లేదని అందుకే ఈ విషయాన్ని పోరాటం స్థాయికి తీసుకెళ్తామని ఆమె తెలిపారు.

ఇక తనపై ఈ డి విచారణ గురించి మాట్లాడుతూ స్త్రీకి అనుకూలంగా ఉండే విధంగా విచారణ చేయాలని అనేక కోర్టు తీర్పులు ఉన్నా,వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపే అవకాశం ఉన్నా కూడా తనను ప్రత్యక్షంగా హాజరవమంటున్నారని దీనిని బట్టి కేసీఆర్ ప్రభుత్వానికి కేంద్రం ప్రభుత్వ పెద్దలు ఎంత భయపడుతున్నారో అర్థం చేసుకోవాలని ఆమె అన్నారు.ఈడీ డైరెక్టర్ ,సెబి డైరెక్టర్లకు పదవీకాలం పూర్తయిన కూడా ఇంకా కొనసాగిస్తున్నారని ఎందుకంటే వాళ్ళందరూ మోడీ మాటలను తూచా తప్పకుండా పాటిస్తారని ఆవిడ విమర్శించారు.

అరెస్టులకు తాను భయపడే మనిషిని కాదని జైలులో ఉన్నంత మాత్రాన కృష్ణుడు బలం తగ్గలేదని వనవాసం చేసినంత మాత్రాన రాముడు ప్రభా తగ్గదని ఆమె పంచ్ డైలాగ్ వేశారు ఏది ఏమైనా తన అరెస్టు తప్పదని కవిత కూడా మానసికంగా ఒక అంచనాకు వచ్చినట్లుగా ఆమె వ్యాఖ్యలు చూస్తే అర్థమవుతుంది.మరి మరి ఈ రెండు పార్టీలు ఒకరిపై మరొకరు వేస్తున్న ఎత్తులు పై ఎత్తులు లలో ఎవరిది పై చేయి అవుతుందో మరి కొద్ది రోజుల్లో తెలుస్తుంది

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube