వీడియో: ఉక్రెయిన్ సైనికుడిని ఎలా కాల్చి చంపారో చూస్తే.. ఒళ్ళు గగర్పొడుస్తుంది!!

ఉక్రెయిన్‌పై రష్యా చాలా కాలంగా యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే.ఈ యుద్ధంలో ఇరువైపులా చాలామంది సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారు.

 Video How A Soldier Of Ukraine Was Shot Dead Will Shed Tears, Ukraine, Russia, S-TeluguStop.com

ముఖ్యంగా రష్యన్ సైనికులు ఉక్రేనియన్ సైనికులను ఊచకోత కోస్తున్నారు.ఈ యుద్ధం నుంచి ఇప్పటికే గుండెల్ని పిండేసే ఎన్నో సంఘటనలు వెలుగులోకి వచ్చాయి.

తాజాగా మరొక హార్ట్ బ్రేకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

“గ్లోరీ టు ఉక్రెయిన్” అని అరిచిన ఒక బందీ సైనికుడిని రష్యన్ సోల్జర్స్ దారుణంగా కాల్చి చంపేశారు.

బుల్లెట్లకు ప్రాణాలు అర్పించడానికి ముందు ఆ సైనికుడు ఒక ట్రెంచ్‌లో సిగరెట్ తాగుతున్నట్లు వీడియోలో కనిపించింది.దాడి చేసినవారు “చావు” అని అరవడం, చంపేసిన తర్వాత బూతులు తిట్టడం మీరు వీడియోలో వినవచ్చు.

మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్​స్కీ ఈ వీడియో పై స్పందించారు.రష్యా దళాలపై వీటన్నిటికీ ప్రతీకారం తీర్చుకుంటానని శపథం చేశారు.

ఇకపోతే ఫిబ్రవరి 3న బఖ్‌ముట్ సమీపంలో జరిగిన ఒక వార్‌లో నుంచి చనిపోయిన సైనికుడు మిస్ అయ్యాడు.ఆ సైనికుడిని 30వ మెకనైజ్డ్ బ్రిగేడ్ టైమోఫీ మైకోలాయోవిచ్ షాదురాగా ఉక్రేనియన్ సైన్యం గుర్తించింది.సైనికుడి మృతదేహం ప్రస్తుతం తాత్కాలికంగా ఆక్రమిత జోన్‌లో ఉంది.మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత సైనికుడిని నిర్ధారిస్తారు.వీడియోపై రియాక్ట్ అయిన అధ్యక్షుడు జెలెన్​స్కీ ఐక్యత కోసం పిలుపునిచ్చారు.సైనికుడి మాటలకు అంగీకరిస్తూ అందరూ ఐక్యంగా స్పందించాలని ఆయన కోరారు.

హంతకులను కనిపెట్టి వారికి న్యాయం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.

2014లో క్రిమియాను రష్యా స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి ఉక్రెయిన్, రష్యా మధ్య శత్రుత్వం కొనసాగుతోంది.ఈ మధ్యకాలంలో ఇది పెద్ద యుద్ధానికి దారితీసింది.ఏది ఏమైనా మాటలతో పరిష్కరించుకునే మార్గాలను వదిలేసి పెద్ద మరణహోమానికి ఈ రెండు దేశాలు పూనుకోవడం అందర్నీ కలిచి వేస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube