సిరిసిల్ల చెందిన ప్రముఖ రచయిత్రి డాక్టర్ కందేపి రాణి ప్రసాద్ కు రాష్ట్ర ప్రభుత్వ అవార్డు

అంతర్జాతీయ మ‌హిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వరంగల్ లోని కాకతీయ క్యాంపస్ ఆడిటోరియంలో బుధవారం వివిధ రంగాల్లో రంగాల్లో విశిష్ట సేవలందించిన 27 మంది మహిళలకు మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు లు అవార్డుతో పాటు ప్రతి ఒక్కరికి 1 లక్ష రూపాయల చొప్పున నగదు పురస్కారాన్ని అందజేశారు.సిరిసిల్ల చెందిన ప్రముఖ రచయిత్రి డాక్టర్ కందేపి రాణి ప్రసాద్ సాహిత్య రంగంలో రాష్ట్ర ప్రభుత్వ అవార్డ్ ను మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు ల నుంచి స్వీకరించారు.

 Dr. Kandepi Rani Prasad, A Noted Writer From Sirisilla, Was Awarded By The State-TeluguStop.com

బాల సాహితి వేత్తగా యాబై పుస్తకాల రచనలతో పాటు మహిళా శిశు అభ్యుదయం కొరకు ప్రమాదకర జబ్బుల గురించి అవగాహన కల్పించేందుకై రచనల్లో కథలు, కవితలు, వ్యాసాలు, పజిల్స్, సైన్స్ వ్యాసంగం, గల్పికలు మొదలైన ప్రక్రియల ద్వారా ఆమె ప్రయత్నించారు.

జిల్లా నుంచి మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయి అవార్డును కందేపి రాణీ ప్రసాద్ ను స్వీకరించడం హర్షణీయం సృజనాత్మకతతో బాల్య సాహిత్యము, ప్రీస్కూల్ ఎడ్యుకేషన్ వివిధ రకాలైనటువంటి మెటీరియల్స్ తో పిల్లలకి ఆకట్టుకునేలా, ఆకర్షణీయమైన పద్ధతుల ద్వారా ప్రీస్కూల్ ఎడ్యుకేషన్ ని పరిపుష్టి చేసేటంలో ఆమె ఎంతో కృషి చేశారు.

ఈ సందర్భంగా వారికి మహిళా శిశు సంక్షేమ శాఖ తరపున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నామని రాజన్న సిరిసిల్ల జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం అన్నారు.బాల సాహిత్యంను పరిపుష్టం చేసేందుకు డాక్టర్ కందేపి రాణి ప్రసాద్ విశేష కృషి చేశారు .సుమారు మూడు దశాబ్దాలకు పైగా సాహితీ రంగానికి తనవంతు సేవ చేశారు.
తన సాహితీ సేవకు అనేక అవార్డులు రివార్డులు చేజిక్కించుకున్న రాణి ప్రసాద్ తాజాగా రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు రావడం సంతోషకరమని జిల్లా పౌర సంబంధాల అధికారి మామిండ్ల దశరథం అన్నారు.

సాహితీ రంగంలో తాను చేసిన సేవకు గుర్తింపుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ అవార్డు రావడం సంతోషంగా ఉంది.సాహితీ రంగానికి మరింత సేవ చేసేందుకు ఈ అవార్డు ప్రేరణ నిస్తుంది.

రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన డాక్టర్ కందేపి రాణి ప్రసాద్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube