బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాల్గవ టెస్ట్ మ్యాచ్ కోసం అహ్మదాబాద్ చేరుకున్న భారత జట్టు హోలీ సంబరాల్లో మునిగి తేలింది.క్రికెటర్లు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ సందడి చేశారు.
సూర్య కుమార్ యాదవ్, అక్షర్ పటేల్, ఇషాన్ కిషన్, మహమ్మద్ సిరాజ్ సంబరాలు చేసుకుంటున్న వీడియోను కుల్దీప్ యాదవ్ తన ఇంస్టాగ్రామ్ లో అప్ లోడ్ చేశారు.ఇక విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శుభ్ మన్ గీల్ సంబరాలు చేసుకున్న వీడియోను శుభ్ మన్ గీల్ తన ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేశాడు.

మొత్తానికి నాలుగో టెస్ట్ మ్యాచ్ కోసం అహ్మదాబాద్ చేరుకున్న చేరుకున్న రోహిత్ సేన హోలీ సంబరాల్లో మునిగితేలిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.ఇక అహ్మదాబాద్ వేదికగా జరగబోయే నాలుగో టెస్ట్ మ్యాచ్ భారత్ కు కీలకం.రెండు టెస్ట్ మ్యాచ్ లలో సమర్థవంతంగా ఆట తీరు కొనసాగించిన భారత్ మూడవ టెస్ట్ మ్యాచ్లో కాస్త తడబడి నిరాశను మిగిల్చింది.ఇక ఎటువంటి పిచ్ తయారు చేయాలో క్యురేటర్లకు భారత జట్టు మేనేజ్మెంట్ నుంచి, బీసీసీఐ నుంచి ఎటువంటి సూచనలు అందలేదు.

ప్రస్తుతం భారత జట్టు ఎటువంటి పిచ్ కావాలో తేల్చుకోలేక పోతోంది.మంగళవారం వరకు నాలుగో టెస్ట్ కోసం రెండు పిచ్ లను కప్పి ఉంచారు.ఈ రెండింటిలో ఏ పిచ్ ను ఉపయోగిస్తారో స్పష్టం చేయలేదు.మ్యాచ్ కీలక మలుపు తిరగాలంటే అది పిచ్ పైనే ఆధారపడి ఉంటుంది.ఇక స్మిత్ సారథ్యంలో ఆస్ట్రేలియా మూడో టెస్ట్ మ్యాచ్లో విజయం సాధించడంతో జట్టులో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు.కానీ భారత జట్టులో మహమ్మద్ సిరాజ్ కు విశ్రాంతి ఇచ్చి, ఉమేష్ యాదవ్, షమీ లను కొనసాగించే అవకాశాలు ఉన్నాయి.







