ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఎప్పటికప్పుడు రంగులు మార్చుకుంటూ ఏ రోజుకారోజు రసవత్తరం గా మారుతున్న నేపథ్యం లో తాజాగా ఎంపీ రఘురామ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరం గా మారాయి.రాష్ట్రం లో గత కొద్ది నెలలుగా పొత్తుల పై చర్చలు జరుగుతున్న క్రమం లో ఈ విషయం పై ఆయన తన అంచనా వెల్లడించారు.
టీడీపీ జనసేన కలిసి పోటీ చేసే నిర్ణయానికి వస్తే మాత్రం వారికి గెలుపు ఖాయమని ,అధికార వైసీపీ కి ఓటమి తప్పదని జోస్యం చెప్పారు.
కొద్ది కాలం గా వైసీపీ అధిష్టానం పై,ప్రభుత్వ విధానాలపై అసంతృప్తి గా ఉంటూ ఎప్పటికప్పుడు తనదైన శైలిలో విమర్శలు చేస్తున్న రఘురామ కృష్ణంరాజు ఈ సారి ఏకంగా ఎన్నికల ఫలితాల పైనే ఇంత ఓపెన్ గా ప్రభుత్వ వ్యతిరేక అంచనా చెప్పడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరం గా మారింది.
అంతే కాకుండా ఈ కూటమిలో బీజేపీ కూడా కలిస్తే మరింత బలం చేకూరినట్టేనని ,ఇక కూటమికి తిరుగుండదని పేర్కొన్నారు.

ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు సకాలం లో జీతాలు ఇవ్వక,రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు ఇవ్వక ఉన్న పీఎఫ్ డబ్బులు కూడా వాడేసుకుంటూ వారిలో ప్రభుత్వం పట్ల తీవ్ర అసంతృప్తి ఏర్పరిచారనీ ఇంత చేసి ప్రభుత్వ ఉద్యోగుల మద్దతు పూర్తిగా ప్రభుత్వానికే ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి చెప్పడం సిగ్గుచేటని చెప్పారు… అంతే కాకుండా విద్యార్థులకు అందాల్సిన విద్యా దీవెన నగదు కూడా సకాలం లో వారికి ఇవ్వకపోవడం వలన కాలేజీ ఫీజులు కట్టలేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనీ విమర్శించారు.

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారిన పొత్తుల గురించి ఈ సమయం లో ఈయన ఈ రకంగా కామెంట్స్ చేయడం మరింత ఆసక్తికరం గా మారింది…మొత్తానికి ఈ జోస్యం నిజమవుతుందో చూడాలంటే దానికంటే ముందు పొత్తుల విషయం ఒక కొలిక్కి రావాలి… ఈ విషయం పై స్పష్టత కోసం మరికొంత సమయం వేచి ఉండాల్సిందే…
.






