నల్గొండ జిల్లా నకిరేకల్ లో హోలీ పొలిటికల్ రంగు పూసుకుంది.నకిరేకల్ లో ఎమ్మెల్యే చిరుమర్తి, మాజీ ఎమ్మెల్యే వీరేశం పోటాపోటీగా హోలీ సంబురాలు నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలోనే రెండు వర్గాల మధ్య బల ప్రదర్శన జరిగింది.హోరాహోరీగా నినాదాలు చేస్తూ హోలీ సంబురాలు నిర్వహించుకున్నారు.
ఈ నేపథ్యంలోనే చిరుమర్తి అనుచరులను మాజీ ఎమ్మెల్యే వీరేశం హెచ్చరించారని తెలుస్తోంది.దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
రంగంలోకి దిగిన పోలీసులు రెండు వర్గాలకు సర్దిచెప్పి పంపించడంతో పరిస్థితి సద్దు మణిగింది.