ప్రస్తుతం సోషల్ మీడియాలో కేరాఫ్ కంచరపాలెం డైరెక్టర్ వెంకటేష్ మహా చేసిన వాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి.కేజిఎఫ్ 2 సినిమా గురించి నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేయడంతో నెటిజన్స్ మండిపడుతున్నారు.
ఇలా ఉంటే ఒక ఇంటర్వ్యూ ఛానల్ లో పాల్గొన్న వెంకటేష్ మహా. కేజీఎఫ్ 2 సినిమాపై కామెంట్స్ చేస్తూ నీచ్ కమిన్ కుత్తే అంటూ ఘాటు విమర్శలు గుప్పించారు.వెంకటేష్ చేసిన వ్యాఖ్యలపై అతనిపై ట్రోల్స్ చేస్తూ మండి పడుతున్నారు.వెంకటేష్ మహా వాక్యలపై స్పందించిన నెటిజన్స్ ఒక దర్శకుడు మరో దర్శకుడి సినిమాని అలాంటి బూతు పదాలతో డీగ్రేడ్ చేయడం ఏంటీ? ఇతను చేసింది బొక్కలో రెండు సినిమాలే.

అందులో కూడా ఒకటి రీమేక్.చేసిన రెండు సినిమాలకే రూ.1200 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాని కామెంట్స్ చేస్తాడా?అంటూ ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు నెటిజన్స్.ఎవరికైనా సినిమా నచ్చనప్పుడు నచ్చలేదు అని చెప్పడంలో తప్పులేదు.
అది కెమెరా ముందైనా, స్ట్రెయిట్ గా ముఖం మీదే అయిన.కానీ పబ్లిక్ ప్లాట్ ఫామ్ పై మాట్లాడుతున్నప్పుడు క్రిటిసైజ్ చేసినా పర్లేదు గాని అలా విలువలు మర్చిపోయి, బూతులతో రెచ్చిపోవడం కరెక్ట్ కాదనేది నెటిజన్స్ వాదన.
నచ్చలేదు అని చెప్పాలనుకుంటే పద్ధతిగా చెప్పవచ్చు.నోరుంది కదా అని నోటికొచ్చినంత మాట్లాడితే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అంటూ అతనిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఇది ఇలా ఉంటే తాజాగా లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి స్పందించింది.

ఎందుకంటే వెంకటేష్ కేజిఎఫ్ సినిమా గురించి కామెంట్లు చేస్తున్నప్పుడు పక్కనే ఉన్న ఆమె నవ్వడంతో కొంతమంది వెంకటేష్ తో పాటు నందిని రెడ్డి ని కూడా ట్యాగ్ ట్రోల్స్ చేస్తున్నారు.దాంతో ఆ ట్రోల్లింగ్స్ పై స్పందించిన నందిని రెడ్డి.దర్శకుడు వెంకటేష్ చేసిన కామెంట్స్.
ఎవరిని ఉద్దేశించినవి కావు.ఎవరినైనా బాధించి ఉంటే క్షమించండి.
మాస్ కమర్షియల్ సినిమాలు ఆడుతున్నాయంటే.వాటిల్లో జనాలకు నచ్చే అంశాలు ఖచ్చితంగా ఉంటాయి.
మా చర్చలలో జరిగిన సంభాషణలు ఎవరి కష్టాన్ని ఉద్దేశించినవి కాదు.ఎవరిని తక్కువ చేసేందుకు కాదు.
ఆ డిబేట్ జస్ట్ పాజిటివ్ గా సాగింది.నేను ఎందుకు నవ్వానంటే వెంకటేష్ వివరించిన వివరించిన విధానానికి నాకు నవ్వొచ్చింది అంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.







